Shubman Gill : ఏంటి.. సారాతో బ్రేకప్ అయ్యిందా.. అనుమానాలు రేకెత్తిస్తోన్న శుభ్‌మన్ గిల్ ఇన్‌స్టా పోస్ట్..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్- యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోన్న..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్- యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా, శుభమన్.. ఒకరి పోస్టులను ఇంకొకరు మెచ్చుకుంటూ లైకులు, కామెంట్లు కురిపిస్తుంటారు. ఇక శుభ్‌మన్ బాగా ఆడిన చాలా సందర్భాల్లో సారా అతనిని మెచ్చుకుంది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. నెటిజన్లు కూడా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై రకరకాలుగా మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శుభ్‌మన్ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సిగ్మా రూల్ నంబర్ వన్’ అనే క్యాప్షన్‌తో టీ-షర్ట్ ధరించి దిగిన ఓ ఫొటోను పంచుకున్నాడీ యంగ్ క్రికెటర్. ఆ షర్ట్‌పై ‘ DONT FALL IN LOVE WITH ANGELS’ ( ఏంజెల్స్‌తో ప్రేమలో పడకండి) అని రాసి ఉంది. దీంతో ఈ ఫొటో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కోల్‌కతా నైట్ రైటర్స్ జట్టులో శుభ్‌మన్‌తో కలిసి ఆడిన నాగర్ కోటి మొదట ‘ఒకే సర్’ అని కామెంట్ పెట్టాడు. ఆ తర్వాత మరికొందరు నెటిజన్లు ‘ ఏంటి శుభ్‌మన్.. సారాతో అప్పుడే బ్రేకప్ అయ్యిందా’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
Also Read: