T20 World Cup: కోహ్లీ సేనకు ధీటైన ప్లేయింగ్ XI ఇదే.. టీ20 ప్రపంచకప్‌లో ఆడిస్తే ఫలితాలు ఎలా ఉండేవో.. అసలు సెలక్షన్‌లో ఏం జరుగుతోంది?
Indian Cricket Team: టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నమెంట్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో దుబాయ్‌లో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ టీ20 ప్రపంచ కప్‌లో రెండు ఘోర పరాజయాలను చవిచూసింది.
Indian Cricket Team: టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నమెంట్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో దుబాయ్‌లో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ టీ20 ప్రపంచ కప్‌లో రెండు ఘోర పరాజయాలను చవిచూసింది. సెమీ-ఫైనల్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. విరాట్ కోహ్లి సేన ఆటతీరుపై మాజీల నుంచి అభిమానుల వరకు అంతా ఏకిపారేస్తున్నారు. ప్రత్యేకించి అదే వేదికలపై సుదీర్ఘమైన, కఠినమైన ఐపీఎల్ పోటీ తర్వాత చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు అందరి ముందున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే.. టీ20 ప్రపంచ కప్ 2021లో అత్యుత్తమ 15 మందిని ఎంపిక చేసిందా? లేక గత ప్రతిష్టను పూడ్చుకునేందుకు వెయిటేజీ ఇచ్చారా? అనేది పెద్ద పెద్ద ప్రశ్నగా మిగిలింది. అయితే ఐపీఎల్ 2021లో ఆడిన ప్లేయర్లను గమనిస్తే.. మనకు ప్రత్యామ్నాయ భారత XIకనిపిస్తోంది. యూఏఈలో ప్రస్తుత ప్లేయింగ్ XIని పడగొట్టే అవకాశం ఉంది. ఓపెనర్లు – రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ ఇందులో ముఖ్యంగా కనిపించనున్నారు. రుతురాజ్ గైక్వాడ్ IPL 2021లో 16 ఇన్నింగ్స్‌లలో 45.35 సగటుతో 635 పరుగులు, 136.26 స్ట్రైక్ రేట్‌తో నాలుగు అర్ధసెంచరీలతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. విశేషమేమిటంటే వెంకటేష్ యూఏఈ లెగ్‌లో దాదాపు 140 స్ట్రైక్ రేట్‌తో 9 ఇన్నింగ్స్‌లలో 439 పరుగులతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గైక్వాడ్ ఓపెనింగ్ భాగస్వామ్యానికి ఫాఫ్ డు ప్లెసిస్‌తో కలిసి రికార్డ్ 756 పరుగులను సాధించాడు. IPL 2021లో ఏ జోడీని పోల్చి చూసినా ఈ జోడినే అగ్రస్థానంలో నిలిచారు. దీంతోనే ఈ సీజన్‌లో CSK నాటకీయ పరిణాల మధ్య నాల్గవ సారి IPL టైటిల్‌కు దారితీసింది.
యూఏఈ లెగ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో వెంకటేష్ అయ్యర్ బ్యాట్‌తో రివీల్ అయ్యాడు. అతను సెకండ్ హాఫ్‌లో KKR ఫైట్‌బ్యాక్‌కు నాయకత్వం వహించాడు. 10 ఇన్నింగ్స్‌లలో 41 సగటుతో 370 పరుగులు చేశాడు. యూఏఈలో శుభమన్ గిల్‌తో అత్యంత విజయవంతమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న క్రమంలో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రోహిత్ శర్మ IPL 2021లో ముంబై ఇండియన్స్ తరపున కేవలం ఒక హై ఇంపాక్ట్ నాక్ ఆడాడు. మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి IPL 2021లో అదరగొట్టారు. KKR అత్యంత స్థిరమైన బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ త్రిపాఠిగా నిలిచాడు. అతను 16 ఇన్నింగ్స్‌లలో 140.28 అత్యధిక స్ట్రైక్ రేట్‌తో 397 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ ఈ సీజన్‌లో మరింత నిలకడగా ఉన్నాడు. 14 ఇన్నింగ్స్‌లలో 40.33 సగటుతో 484 పరుగులు, 137 స్ట్రైక్ రేట్‌తో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సీజన్‌లో మొత్తం మీద ఆరవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను తన ఫ్రాంచైజీ కోసం అనేక హై ఇంపాక్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇది రిషబ్ పంత్ ప్రదర్శనకు విరుద్ధంగా ఉంది. అతను తన ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయాడు. 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోసం కేవలం 128.52 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. అతని కెరీర్ స్ట్రైక్ రేట్ కంటే చాలా తక్కువగా పరుగులు సాధించాడు.
శ్రేయాస్ అయ్యర్‌కి ఈ ఏడాది ఐపీఎల్‌లో గొప్పగా లేదు. కానీ, అతను పరిమిత ఓవర్లలో భారతదేశం కోసం మంచి రికార్డును కలిగి ఉన్నాడు. అయ్యర్ ODIలలో బ్యాటింగ్ సగటు 42.78, స్ట్రైక్ రేట్ 100.37గా ఉంది. టీ20ఐలలో 28.94, స్ట్రైక్ రేట్ 133.81 కలిగి ఉన్నాడు. క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించడంలో అతని అనుభవం అతన్ని ఈ ప్రత్యామ్నాయ భారత XIకి నాయకత్వం వహించే ప్రధాన అభ్యర్థిగా చేసింది. కేఎల్ రాహుల్‌పై దృష్టి కేంద్రీకరించినప్పుడు, పంజాబ్ కింగ్స్‌కు చెందిన మరో స్టార్ – మయాంక్ అగర్వాల్. మయాంక్ ప్రదర్శన IPL 2021లో పూర్తిగా సాగలేదు. అగర్వాల్ 12 మ్యాచ్‌లలో 40 కంటే ఎక్కువ సగటుతో 441 పరుగులు, 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో కొట్టాడు. ఈ ఐపీఎల్‌లో అతను నాలుగు అర్ధశతకాలు నమోదు చేశాడు.
అలాగే ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ IPL 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అత్యధిక ప్రభావం చూపిన ఆటగాడిగా నిలిచాడు. ప్రతీ మ్యాచులో తన స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన అత్యుత్తమ నాణ్యతకు కట్టుబడి బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టాడు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కీలక సమయాల్లో కీలక వికెట్లు పడగొట్టారు. అక్షర్ 12 మ్యాచ్‌లలో 6.65 అద్భుతమైన ఎకానమీ రేట్‌తో 15 వికెట్లు తీశాడు. అయితే ప్లేయింగ్ XIలో భాగం కాకుండా నిర్ణయానికి హేతుబద్ధమైన వివరణ లేకుండా బెంచ్ సీటుకే పరిమితం చేశారు. మరో స్పిన్నర్ – యుజ్వేంద్ర చాహల్ ఇండియా లెగ్‌లో టోర్నమెంట్‌ను పేలవంగా ప్రారంభించిన తర్వాత, యూఏఈలో తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో టోర్నీలో భాగస్వామ్యమైన స్పిన్నర్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తిరిగి వచ్చాడు. లెగ్ స్పిన్నర్ సీజన్‌లో 17.6 స్ట్రైక్ రేట్, 7.05 ఎకానమీ రేట్‌తో 15 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. కేవలం 8 మ్యాచ్‌లలో 12.8 స్ట్రైక్ రేట్, 6.13 ఎకానమీతో 14 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. చాహల్ తన అత్యుత్తమ స్థాయికి తిరిగి వచ్చాడు. చాహల్ మిడిల్ ఓవర్‌లలో బ్యాట్స్‌మెన్‌లను తన నైపుణ్యంతో పెవిలియన్ చేర్చగలడు. పరుగులు ఇవ్వకుండానే వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్నవాడు.
ఫాస్ట్ బౌలర్లు – హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, దీపక్ చాహర్ అద్బుతంగా ఆకట్టుకున్నారు. IPL 2021లో హర్షల్ పటేల్, అవేష్ ఖాన్ వరుసగా 32, 24 వికెట్లు పడగొట్టారు. పటేల్ 14.34 సగటు, 10.5 స్ట్రైక్ రేట్‌తో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో రికార్డును సమం చేయగా, ఖాన్ స్ట్రైక్ రేట్ 15.2, కేవలం 7.37 ఎకానమీ రేట్‌తో నియంత్రణలో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత ఫలవంతమైన కొత్త బౌలర్‌లలో ఒకరైనప్పటికీ దీపక్ చాహర్‌ను భారతదేశం ఆశ్చర్యకరంగా రిజర్వ్‌లలో ఉంచింది. అతను IPL 2021లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు సాధించాడు. గత కొన్ని ఎడిషన్‌లలో CSK తరపున అద్భుతంగా ఆకట్టుకున్నాడు. చాహర్ టీ20 క్రికెట్‌లో 112 మ్యాచ్‌లలో 18.7 స్ట్రైక్ రేట్‌తో 128 వికెట్లు, కేవలం 7.54 ఎకానమీతో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. కాబట్టి, యూఏఈలోని కోహ్లిసేనకు గట్టి సవాలు విసిరే ప్రత్యామ్నాయ భారత ప్లేయింగ్ XI లో ఎవరున్నారో చూద్దాం:
1. రుతురాజ్ గైక్వాడ్ 2. వెంకటేష్ అయ్యర్ 3. రాహుల్ త్రిపాఠి 4. సంజు శాంసన్ (కీపర్) 5. శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్) 6. మయాంక్ అగర్వాల్ 7. అక్షర్ పటేల్ 8. దీపక్ చాహర్ 9. అవేష్ ఖాన్ 10. హర్షల్ పటేల్ 11. యుజ్వేంద్ర చాహల్ టీ20 ప్రపంచ కప్‌లో ప్రస్తుత భారత బృందం బయో-బబుల్ అలసట, కొంతమంది సీనియర్ల పేలవమైన ప్రదర్శన దృష్టిలో ఉంచుకుని, 2021 IPLలో వారి ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం మరింత వివేకంతో కూడినది. యూఏఈలో ఐపీఎల్ 2021లో ఆడిన అదే పిచ్‌లో ఐసీసీ మెగా ఈవెంట్ ఆడుతున్నారు. ఇలాంటి మెగా ఈవెంట్‌లో దేశం తరపున ఆడేందుకు ఎంచుకునే సభ్యుల లిస్టులో ఇలాంటి తప్పిదాలు జరిగితే ప్రస్తుత ఫలితాలనే చవిచూడాల్సి వస్తుంది.
IND vs AFG: సిక్సర్లు బాదుతున్న టీమిండియా ఫినిషర్.. కానీ మ్యాచ్‌లో రాణిస్తాడో లేదో తెలియడం లేదు..