IND vs ENG: భారత జట్టులో అతనో జోకర్.. లైవ్ మ్యాచ్‌లో రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు.. ఎవరో తెలుసా?
భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువైన రవిశాస్త్రి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ టెస్ట్ సందర్భంగా లైవ్ టీవీలో ఒక భారత క్రికెటర్‌ను 'జోకర్' అని సంబోధించడం క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. శాస్త్రి వ్యాఖ్యలు సరదాగా అన్నారా లేక నిజంగానే ఆ క్రికెటర్ ప్రవర్తనపై విసుగు చెందారా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 3వ టెస్ట్ రెండో రోజు మరికొద్ది గంటల్లో మొదలుకానుంది. తొలి రోజు ఆతిథ్య జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. రోజు ముగిసే వరకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. అయితే తొలి రోజు ఆటలో ఎన్నో సరదా విషయాలు చోటు చేసుకున్నాయి. వీటిలో సిరాజ్, గిల్ ఇంగ్లండ్ అనుసరించే బ్యాటింగ్ వ్యూహంపై కామెంట్స్ చేయడం లాంటివి ఉన్నాయి. ఇదే సమయంలో రవిశాస్త్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. భారత పేసర్లలో ఒకరిని ‘జోకర్’ అని పిలిచిన రవిశాస్త్రి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాక్యలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
అసలేం జరిగింది?
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఓలీ పోప్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మొహమ్మద్ సిరాజ్ అతని వైపు దూసుకుపోవడంతో రవి శాస్త్రి సంభాషణ ప్రారంభమైంది. బంతి అతని కుడి ప్యాడ్, కాలు మధ్య ఇరుక్కుపోవడంతో, వికెట్ పడే అవకాశాన్ని గ్రహించిన సిరాజ్, బ్యాట్స్‌మన్ వైపు పరిగెత్తాడు. కానీ పోప్, ఈ సందర్భాన్ని గమనించి, బంతిని తీసుకొని నేలపై ఉంచాడు. “సిరాజ్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు నేరుగా బ్యాట్స్‌మన్ వైపు పరుగెత్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సమయంలో రవిశాస్త్రి తోటి వ్యాఖ్యాత మైఖేల్ అథర్టన్, డ్రెస్సింగ్ రూమ్‌లో సిరాజ్ ఎలా ఉంటాడని అడిగాడు. ఈ ప్రశ్నకు రవి శాస్త్రి సమాధానం చెబుతూ.. “ఓహ్, అతను జోకర్” అంటూ బాంబే పేల్చాడు. అంటే రవిశాస్త్రి ఉద్యేశంలో సిరాజ్ ఎన్నో జోకులు వేస్తూ, డ్రెస్సింగ్ రూం వాతావరణాన్ని సరదాగా మార్చేస్తుంటాడనే అర్థంలో చెప్పాడన్నమాట.
ప్రతి జట్టుకు డ్రెస్సింగ్ రూమ్‌లో మానసిక స్థితిని మెరుగుపరిచే ఒక పాత్ర అవసరం. ఇలాంటి పాత్రకు సిరాజ్ కచ్చితంగా సరిపోతాడు. తన తోటి ఆటగాళ్లను జోకులతో నవ్విస్తూ, మైదానంలో మాత్రం సిరీయస్‌గా బౌలింగ్ చేస్తూ వాతావరణాన్ని మార్చేస్తాడు.
‘డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వులు పూయించే సిరాజ్’
“సిరాజ్, పంత్ ఇద్దరూ ఒకలాంటి వారే. అయితే, సిరాజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి పొందినా డ్రెస్సింగ్ రూంలో మాత్రం నవ్వులు పూయిస్తూనే ఉంటాడని రవి శాస్త్రి తెలిపాడు
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కోసం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని శాస్త్రి ప్రశంసించాడు. లీడ్స్‌లో జరిగిన ఓపెనర్ మ్యాచ్‌లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసిన సిరాజ్, ఎడ్జ్‌బాస్టన్‌లో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 6/70 భారత్‌కు భారీ ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది.
క్రికెట్ మాజీల స్పందన..
రవిశాస్త్రి వ్యాఖ్యలపై క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది రవిశాస్త్రి శైలి ఇదేనని, దీన్ని పెద్ద విషయంగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరికొందరు మాత్రం, జాతీయ జట్టు తరఫున ఆడుతున్న ఒక ఆటగాడిని లైవ్ టీవీలో అలా సంబోధించడం సరైనది కాదని, అది ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. ఈ సంఘటన భారత క్రికెట్ జట్టులోని అంతర్గత వాతావరణంపై కూడా కొంత చర్చకు దారితీసింది.
ఏది ఏమైనా, రవిశాస్త్రి వ్యాఖ్యలు లార్డ్స్ టెస్ట్ తో పాటు భారత క్రికెట్ లో మరో ఆసక్తికరమైన అంశంగా మారాయి. ఈ వ్యవహారంపై భవిష్యత్తులో ఇంకేమైనా స్పష్టత వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




