IPL 2025: కోహ్లీకి వెన్నుపోటుపొడిసిన RCB కెప్టెన్! నేను అతనికి పెద్ద ఫ్యాన్ అంటూ షాకింగ్ కామెంట్స్!
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి RCB నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఫిల్ సాల్ట్ అద్భుత ఇన్నింగ్స్, సుయాష్ శర్మ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను RCB ఏకపక్షంగా నెగ్గింది. కెప్టెన్ పాటిదార్ ఈ ఆటగాళ్లను ప్రశంసించగా, కోహ్లీని ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం చర్చకు దారి తీసింది. అయినా కోహ్లీ ఆటను మించి వ్యూహాత్మకంగా జట్టుపై చూపించిన ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంతో బెంగళూరు జట్టు అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా, కెప్టెన్ రజత్ పాటిదార్ తన జట్టులోని ఓపెనర్ ఫిల్ సాల్ట్, స్పిన్నర్ సుయాష్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో RCB స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. మొదట బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్ (3/21), యష్ దయాల్ (2/26), భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ సహా బౌలర్లు కలసి పంజాబ్ కింగ్స్‌ను కేవలం 101 పరుగులకే కట్టడి చేశారు. స్పిన్నర్ సుయాష్ శర్మ తన అద్భుత బౌలింగ్‌తో కేవలం 17 పరుగులకే మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 27 బంతుల్లోనే అజేయంగా 56 పరుగులు చేయడం ద్వారా RCBను కేవలం 10 ఓవర్లలో గెలుపు దిశగా నడిపించాడు.
కెప్టెన్ రజత్ పాటిదార్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, “ఫిల్ సాల్ట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. నేను అతనికి పెద్ద అభిమాని. డగౌట్‌లో ఉండి అతన్ని చూస్తుండటం ఓ ఆనందకర అనుభూతి. అలాగే సుయాష్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. అతను స్టంప్స్‌ను టార్గెట్ చేస్తూ లైన్స్, లెన్త్ తో బౌలింగ్ చేశాడు. నేను ఎప్పుడూ అతనికి స్పష్టమైన ఆలోచనలు ఇవ్వాలనుకుంటా. కొన్ని పరుగులు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు, కానీ అతను తన పథాన్ని తెలుసుకొని బౌలింగ్ చేయడం నాకు గర్వకారణం” అని అన్నాడు. అయితే పాటిదార్ తన ప్రసంగంలో విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం కొంతమందిలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కోహ్లీ ఆ మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు చేసి అవుటయ్యాడు, కానీ అతని ప్రస్థానం అంతేం కాదు.
వాస్తవానికి, ఈ మ్యాచ్‌లో కోహ్లీ అధికారిక కెప్టెన్ కాకపోయినా ‘షాడో కెప్టెన్’ పాత్రను పోషించాడు. ఫీల్డింగ్ సెట్టింగులు, బౌలర్లకు సూచనలు ఇచ్చే విషయంలో అతని వ్యూహాత్మక నైపుణ్యం స్పష్టంగా కనిపించింది. ఈ సీజన్ మొత్తాన్ని గమనిస్తే కోహ్లీ ఇప్పటివరకు 614 పరుగులతో అత్యుత్తమ ఫారంలో ఉన్నాడు. వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా “పాటిదార్ కూడా కోహ్లీ మాట వింటాడు” అని అభిప్రాయపడ్డారు. ఇది కోహ్లీ జట్టులో ఉన్న ప్రభావాన్ని, గౌరవాన్ని స్పష్టం చేస్తుంది.
ఇదిలా ఉండగా, కోహ్లీని పాటిదార్ స్పష్టంగా ప్రస్తావించకపోవడం ఒకవైపు అభిమానులలో చర్చకు దారి తీసినా, మరోవైపు ఫిన్ సాల్ట్, సుయాష్ శర్మ లాంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు న్యాయం చేసినట్లు భావించవచ్చు. ఏది ఏమైనా, ఆర్‌సిబి ఇప్పుడు ఫైనల్‌లోకి దూసుకెళ్లి తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ సాధించాలని పట్టుదలతో ఉన్నది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



