RCB vs RR IPL Match Result: దుమ్మురేపిన రాజస్థాన్‌.. బెంగళూరుపై భారీ విజయం.. టైటిల్‌ పోరులో చోటు..

RCB vs RR IPL Match Result: క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో ఓటమిని చవి చూసిన రాజస్థాన్‌ రాయల్స్‌ క్వాలిఫయర్‌-2లో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చింది. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది..

RCB vs RR IPL Match Result: దుమ్మురేపిన రాజస్థాన్‌.. బెంగళూరుపై భారీ విజయం.. టైటిల్‌ పోరులో చోటు..
Follow us
Narender Vaitla

|

Updated on: May 27, 2022 | 11:20 PM

RCB vs RR IPL Match Result: క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో ఓటమిని చవి చూసిన రాజస్థాన్‌ రాయల్స్‌ క్వాలిఫయర్‌-2లో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చింది. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో టైటిల్‌ పోరులో స్థానం దక్కించుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడే అవకాశాన్ని సొంతం చేసుకుంది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.1 ఓవర్లలో ఛేదించింది. బట్లర్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 60 బంతుల్లోనే 10 ఫోర్‌లు, 6 సిక్స్‌లతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తర్వాత యశస్వీ జైస్వాల్ (21), సంజూ శాంసన్ (23)తో బట్లర్‌కు జతకలిశారు. ఇక బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు, హసరంగ ఒక వికెట్ పడగొట్టారు.

ఇదిలా ఉంటే అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 10 ఓవర్ల వరకు నిధానంగా సాగింది. అదే సమయంలో రాజస్థాన్ బౌలర్ల దాటికి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ చాలా త్వరగా వికెట్లు సమర్పించుకున్నారు. ఓపెనర్లు విరాట్ 8 బంతుల్లో 7 పరుగులు చేయగా.. డూ ప్లెసిస్ 27 బంతుల్లో 25 పరుగులు చేశాడు. వీరు ఔట్ అయ్యే సమయానికి జట్టు స్కోర్ 50 కి అటు ఇటుగా మాత్రమే ఉంది. ఆ తరువాత వచ్చిన రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ విజృంభించడంతో టీమ్ స్కోర్ పెరిగింది. రజత్ పాటి దార్ 42 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 58 పరుగులు చేశాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?