RR vs RCB IPL 2022 Qualifier 2 Highlights: శతకొట్టిన బట్లర్‌.. బెంగళూరుపై రాజస్థాన్‌ సునాయాస విజయం..

| Edited By: Narender Vaitla

Updated on: May 27, 2022 | 11:23 PM

RR vs RCB IPL 2022 Qualifier 2 Highlights: కీలక మ్యాచ్‌లో బట్లర్‌ చెలరేగి ఆడాడు. కేవలం 60 బంతుల్లోనే 106 పరుగులతో అజేయంగా నిలిచి రాజస్థాన్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న రాజస్థాన్‌...

RR vs RCB IPL 2022 Qualifier 2 Highlights: శతకొట్టిన బట్లర్‌.. బెంగళూరుపై రాజస్థాన్‌ సునాయాస విజయం..
Rr Vs Rcb

IPL 2022: క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో ఓటమిని చవి చూసిన రాజస్థాన్‌ రాయల్స్‌ క్వాలిఫయర్‌-2లో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చింది. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో టైటిల్‌ పోరులో స్థానం దక్కించుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.1 ఓవర్లలో ఛేదించింది. బట్లర్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 60 బంతుల్లోనే 10 ఫోర్‌లు, 6 సిక్స్‌లతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తర్వాత యశస్వీ జైస్వాల్ (21), సంజూ శాంసన్ (23)తో బట్లర్‌కు జతకలిశారు. ఇక బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు, హసరంగ ఒక వికెట్ పడగొట్టారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 May 2022 11:06 PM (IST)

    రాజస్థాన్‌ గ్రాండ్‌ విక్టరీ..

    కీలక మ్యాచ్‌లో బట్లర్‌ చెలరేగి ఆడాడు. కేవలం 60 బంతుల్లోనే 106 పరుగులతో అజేయంగా నిలిచి రాజస్థాన్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న రాజస్థాన్‌ ఐపీఎల్‌ 2022లో ఫైనల్‌కు చేరుకుంది. రాజస్థాన్‌ టైటిల్‌ పోరులో గుజరాత్‌తో తలపడనుంది.

  • 27 May 2022 10:55 PM (IST)

    మూడో వికెట్‌ డౌన్‌..

    రాజస్థాన్‌ మూడో వికెట్ కోల్పోయింది. దేవదత్‌ పడిక్కల్‌ 9 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుట్‌ అయ్యాడు. హేజల్‌వుడ్‌ బౌలింగ్‌లో కార్తిక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఇక బట్లర్‌ సెంచరీకి మరో 5 పరుగుల దూరంలో ఉన్నాడు.

  • 27 May 2022 10:49 PM (IST)

    కొనసాగుతోన్న బట్లర్‌ దూకుడు..

    జోస్‌ బట్లర్‌ దూకుడు కొనసాగుతోంది. బెంగళూరు ఇచ్చిన లక్ష్యాన్ని చేధించే దిశగా రాజస్థాన్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బట్లర్‌ కేవలం 52 బంతుల్లో 88 పరుగులు సాధించాడు. దీంతో 16 ఓవర్లకు రాజస్థాన్‌ 140 పరుగులు సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్‌ విజయానికి 24 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉంది.

  • 27 May 2022 10:28 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌..

    రాజస్థాన్‌ దూకుడుకు బ్రేక్‌ పడింది. సంజూ సాంసన్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. హసనరంగా బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో రాజస్థాన్‌ 113 పరుగుల వద్ద రెండో కోల్పోయింది.

  • 27 May 2022 10:19 PM (IST)

    100 పరుగుల దాటి రాజస్థాన్‌ స్కోర్‌ బోర్డ్‌..

    రాజస్థాన్‌ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 100 పరగులు మార్క్‌ను చేరుకుంది. దూకుడు మీదున్న బట్లర్‌కు సంజూ సాంమ్సన్‌ తోడవడంతో జట్టు స్కోరు దూసుకుపోతోంది. రాజస్థాన్‌ గెలుపునకు ఇంకా 63 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంది.

  • 27 May 2022 10:17 PM (IST)

    దూకుడు మీదున్న బట్లర్‌..

    బట్లర్‌ దూకుడుగా ఆడుతుండడంతో రాజస్థాన్‌ స్కోర్‌ బోర్డ్‌ పరుగులు పెడుతోంది. బెంగళూరు ఇచ్చిన 158 పరుగుల లక్ష్యాన్ని చేధించే బాధ్యతను తీసుకున్న బట్లర్‌ వరుస బౌండరీలను బాదుతున్నాడు. ఈ క్రమంలో కేవలం 32 బంతుల్లోనే 65 పరుగులు సాధించాడు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్‌ 1 వికెట్‌ నష్టానికి 97 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 27 May 2022 10:02 PM (IST)

    వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. యశశ్వి క్యాచ్ ఔట్..

    రాజస్థాన్ టీమ్‌కు తొలి షాక్ తగిలింది. ఓపెనర్ యశశ్వి క్యాచ్ ఔట్ అయ్యాడు. 13 బంతులాడిన యశశ్వి 21 పరుగులు చేశాడు.

  • 27 May 2022 09:44 PM (IST)

    దంచికొడుతున్న రాజస్థాన్ బ్యాటర్స్.. 2 ఓవర్లకు 23 పరుగులు..

    రాజస్థాన్ ఓపెనర్స్ యశశ్వి జైస్వాల్, జోస్ బట్లర్ మాంచి స్పీడ్‌మీదున్నారు. జైస్వాల్ 8 బంతుల్లో 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 17 పరగులు చేశాడు. బట్లర్ 7 బంతుల్లో 1 ఫోర్‌తో 6 పరుగులు చేశాడు.

  • 27 May 2022 09:43 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: బ్యాటింగ్ మొదలు పెట్టిన రాజస్థాన్..

    158 పరుగుల లక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ బరిలోకి దిగింది. ఓపెనర్లు యశశ్వి జైస్వాల్, జోస్ బట్లర్ బ్యాటింగ్‌కు వచ్చారు.

  • 27 May 2022 09:20 PM (IST)

    ముగిసిన బెంగళూరు ఇన్నింగ్స్.. రాజస్థాన్ లక్ష్యం 158..

    రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RR vs RCB) తలపడుతున్నాయి. ఐపీఎల్ 2022 క్వాలిఫైయర్ 2 మ్యా్చ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన జట్టు.. 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ టీమ్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. టీమ్ ఓపెనర్స్ శుభారాంభం అందించకపోవడంతో.. జట్టు స్కోర్ 10 ఓవర్ల వరకు నిధానంగా సాగింది. అదే సమయంలో రాజస్థాన్ బౌలర్లు ఫుల్ ఫైర్ మీదుండటంతో ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ చాలా త్వరగా వికెట్లు సమర్పించుకున్నారు. ఓపెనర్లు విరాట్ 8 బంతుల్లో 7 పరుగులు చేయగా.. డూ ప్లెసిస్ 27 బంతుల్లో 25 పరుగులు చేశాడు. వీరు ఔట్ అయ్యే సమయానికి జట్టు స్కోర్ 50 కి అటు ఇటుగా మాత్రమే ఉంది. ఆ తరువాత వచ్చిన రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ విజృంభించడంతో టీమ్ స్కోర్ అమాంతం పెరిగింది. రజత్ పాటి దార్ 42 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. ఇక 13 బంతులాడిన మ్యాక్స్‌వెల్ 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 24 పరుగులు చేసి ఉన్నంతసేపు దుమ్మురేపాడు. ఇలాంటి సమయంలో రాజస్థాన్ బౌలర్లు కాస్త పట్టు బిగించారు. దాంతో మళ్లీ బోల్తాపడ్డారు ఆర్సీబీ బ్యాటర్స్. వారి బౌలింగ్ దెబ్బకు వరుసగా పెవిలియన్ బాట పట్టారు బెంగళూరు బ్యాట్స్‌మెన్. పాటిదార్, మ్యాక్స్‌వెల్ తరువాత వచ్చిన షాబాజ్ అహ్మద్ మినహా ఏ బ్యాట్స్‌‌మెన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. చివరకు 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. 158 పరుగులు లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ముందు ఉంచింది. మరి ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ చేధిస్తుందా లేదా అనేది మరికాసేపట్లో తేలనుంది.

  • 27 May 2022 09:08 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. వనిందు హసరంగా ఔట్..

    ఆర్‌సీబీ జట్టు ఏడో వికెట్‌ను కోల్పోయింది. 18వ ఓవర్‌లో ప్రసిధ్ వేసిన బౌలింగ్‌లో వనిందు హసరంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం జట్టు స్కోర్ 147/7.

  • 27 May 2022 09:06 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..

    ఆర్‌సీబీ టీమ్ ఆరో వికెట్ కోల్పోయింది. వరుసగా మహిపాల్ లోమోర్డ్, దినేష్ కార్తీక్ ఔట్ అయ్యారు.

  • 27 May 2022 09:04 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: రజత్ పాటిదార్ అవుట్..

    రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆర్సీబీ స్కోర్ పెరగడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రజత్ పాటిదార్ వికెట్‌ను అశ్విన్ పడగొట్టాడు. 16వ ఓవర్‌ మూడో బంతికి రజత్ పాటిదార్ లాంగ్ ఆఫ్ వద్ద బంతిని ఆడాడు. జోస్ బట్లర్ బంతిని క్యాచ్ పట్టడంతో పాటిదార్ పెవిలియన్ బాట పట్టాడు. కాగా, రజత్ పాటిదార్ 42 బంతుల్లో 58 పరుగులు చేశారు.

  • 27 May 2022 08:41 PM (IST)

    గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ స్పీడ్‌కు బ్రేక్.. క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపిన మెక్‌కాయ్..

    క్రీజ్‌లోకి రావడం రావడంతోనే మాంచి స్పీడ్‌మీదున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు మెక్‌కాయ్ బ్రేక్ వేశాడు. బోల్డ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ షాట్‌కు ట్రై చేయగా.. మెక్‌కాయ్ ఆ బంతిని క్యాచ్ పట్టాడు. దాంతో మ్యాక్స్‌వెల్ పెవిలియన్ బాట పట్టాడు.

  • 27 May 2022 08:38 PM (IST)

    దుమ్ములేపుతున్న ఆర్సీబీ బ్యాట్స్‌మెన్.. క్రీజులో రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్..

    ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ దుమ్మురేపుతున్నారు. జట్టు స్కోర్ పెంచేందుకు శ్రమిస్తున్నారు. మ్యాక్స్‌ వెల్ అయితే మెరుపులు మెరిపిస్తున్నాడు. కేవలం 8 బంతుల్లోనే 2 సిక్సులు, 1 ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. ఇక పాటిదార్ 44 పరుగులు చేశాడు.

  • 27 May 2022 08:23 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: ఆర్సీబీకి మరో షాక్.. ఫాఫ్ డు ప్లెసిస్ ఔట్..

    Rajasthan vs Bangalore, LIVE Score: ఆర్సీబీ ఓపెనర్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ ఫా డు ప్లెసిస్ ఔట్ అయ్యాడు. ఒబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో బంతిని బాదగా.. అశ్విన్ దానిని క్యాచ్ పట్టాడు.

  • 27 May 2022 08:07 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: 7 ఓవర్లకు ఆర్‌సీబీ స్కోర్ 54-1

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. 7 ఓవర్లు ముగిసే సరికి 54 పరుగలు చేసింది.

  • 27 May 2022 07:55 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: విరాట్ కోహ్లీ ఔట్..

    రెండో ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరుకున్నాడు. సెకండ్ ఓవర్ ఐదో బంతి కోహ్లి బ్యాట్ అంచుకు తగిలి శాంసన్ సింపుల్ క్యాచ్ పట్టాడు. 8 బంతుల్లో 7 పరుగులు చేసిన కోహ్లీ ఈ క్యాచ్‌తో క్రీజ్ నుంచి వెనుదిరిగాడు.

  • 27 May 2022 07:44 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆర్సీబీ..

    రాజస్థాన్ రాయల్స్ తరఫున ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌ను ప్రారంభించగా.. ఆర్సీబీ నుంచి ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ బ్యాటర్స్‌గా క్రీజ్‌లోకి వచ్చారు.

  • 27 May 2022 07:37 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: RCB ప్లేయింగ్ XI

    Royal Challengers Bangalore: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమోర్డ్, దినేష్ కార్తీక్ (WK), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ మరియు జోష్ హేజిల్‌వుడ్.

  • 27 May 2022 07:36 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: రాజస్థాన్ ప్లేయింగ్ XI

    Rajasthan Royals: సంజు శాంసన్ (కెప్టెన్-వికె), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రణంద్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్

  • 27 May 2022 07:34 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: టాస్ గెలిచిన రాజస్థాన్..

    క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది.

Published On - May 27,2022 7:29 PM

Follow us