RR vs SRH 1st Innings Highlights: హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన శాంసన్, బట్లర్.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య రోజు రెండో మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ ముందు 215 పరుగుల టార్గెట్ నిలిచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య రోజు రెండో మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ ముందు 215 పరుగుల టార్గెట్ నిలిచింది.
యశస్వి 35 పరుగులకే పెవిలియన్..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ వచ్చిన వెంటనే దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. 5వ ఓవర్ చివరి బంతికి రాజస్థాన్ తొలి వికెట్ పడింది. యశస్వి 18 బంతుల్లో 35 పరుగుల తర్వాత ఔట్ అయ్యాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
బట్లర్ సెంచరీ మిస్..
19వ ఓవర్ మూడో బంతికి రాజస్థాన్ రెండో వికెట్ పడింది. ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీ మిస్సయ్యాడు. 59 బంతుల్లో 95 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతను 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో బట్లర్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. సంజూ శాంసన్ 37 బంతుల్లో 62 పరుగులు, షిమ్రాన్ హెట్మెయర్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
రెండు జట్ల ప్లేయింగ్ 11..
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..