GT vs LSG IPL Match Result: చిత్తుగా ఓడిన లక్నో.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుజరాత్..
గుజరాత్ టైటాన్స్ వారి సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 227 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్ అజేయంగా 94, వృద్ధిమాన్ సాహా 81 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.
గుజరాత్ టైటాన్స్ వారి సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 227 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్ అజేయంగా 94, వృద్ధిమాన్ సాహా 81 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. సమాధానంగా 8 ఓవర్లలో వికెట్ లేకుండా 88 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ తరపున మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మోహిత్ నాలుగు ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుత సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా ఆ జట్టు నిలిచింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జట్టు 51వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్‌ను 56 పరుగుల తేడాతో ఓడించింది.
లక్నోపై గుజరాత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం. ఈ సీజన్‌లో గుజరాత్ 8వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టు 16 పాయింట్లతో ఉంది.
ఇరు జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(కీపర్), స్వప్నిల్ సింగ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మొహసిన్ ఖాన్, అవేష్ ఖాన్.
LSG ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆయుష్ బదోనీ, అమిత్ మిశ్రా, డేనియల్ సామ్స్, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
GT ఇంపాక్ట్ ప్లేయర్స్: అల్జారీ జోసెఫ్, దాసున్ షనక, కేఎస్ భరత్, శివం మావి, జయంత్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..