RR vs SRH: సూపర్‌ థ్రిల్లర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ అద్భుత విజయం.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు మరో విజయాన్ని అందుకుంది. జైపూర్‌ వేదికగా ఆదివారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి అందుకుని టోర్నీలో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

RR vs SRH: సూపర్‌ థ్రిల్లర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ అద్భుత విజయం.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం
Sunrisers Hyderabad
Follow us
Basha Shek

|

Updated on: May 07, 2023 | 11:46 PM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు మరో విజయాన్ని అందుకుంది. జైపూర్‌ వేదికగా ఆదివారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి అందుకుని టోర్నీలో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్‌ శర్మ(55), రాహుల్‌ త్రిపాఠి (47), అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌(33), క్లాసెన్‌(26) పరుగులు చేశారు. చివర్లో వచ్చిన ఫిలిప్స్‌( 7 బంతుల్లో 25, ఒక ఫోర్‌, 3 సిక్స్‌లు ), అబ్దుల్‌ సమద్‌ ( 7 బంతుల్లో 17 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్‌ ఆడి సన్‌రైజర్స్‌కు అద్భుత విజయాన్ని అందించారు. రాజస్థాన్‌ బౌలర్లలో చాహల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి 4 వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్‌, కుల్దీప్‌ చెరో వికెట్‌ తీశారు. తాజా విజయంతో హైదరాబాద్‌ ఖాతాలో 8 పాయింట్లు వచ్చాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆ జట్టు 9వ స్థానంలో ఉంది.

అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కు మరోసారి శుభారంభం దక్కింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌ ధాటిగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. 5వ ఓవర్ చివరి బంతికి యశస్వి (18 బంతుల్లో 35 పరుగులు) త ఔట్ అయ్యాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆతర్వాత బట్లర్‌తో జత కలిసిన కెప్టెన్‌ సంజూ రాజస్థాన్‌ స్కోరు బోర్డును పరగులు పెట్టించారు. బట్లర్( 59 బతుల్లో 95, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ మిస్‌ కాగా, శాంసన్(37 బంతుల్లో 66) మరోసారి సునామీ ఇన్నింగ్స్‌ తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, జాన్సెన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..