PBKS vs KKR: కోల్‌కతాకు భారీ షాకిచ్చిన వరుణుడు.. డీఎల్ఎస్ పద్ధతిలో పంజాబ్ విజయం..

Punjab Kings vs Kolkata Knight Riders: ఐపీఎల్-16లో పంజాబ్ కింగ్స్ విజయంతో శుభారంభం చేసింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో ఓడించింది.

PBKS vs KKR: కోల్‌కతాకు భారీ షాకిచ్చిన వరుణుడు.. డీఎల్ఎస్ పద్ధతిలో పంజాబ్ విజయం..
Pbks Win Over Kkr
Follow us
Venkata Chari

|

Updated on: Apr 01, 2023 | 8:15 PM

ఐపీఎల్-16లో పంజాబ్ కింగ్స్ విజయంతో శుభారంభం చేసింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో ఓడించింది.

మొహాలీ మైదానంలో కోల్‌కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. దీంతో DLS పద్ధతి ప్రకారం కోల్‌కతా 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌ పునరాగమనాన్ని పంజాబ్ కింగ్స్ మొహాలీలో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో తొలిసారిగా, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2023లో తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 7 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ నియమం) తేడాతో ఓడించింది. తొలుత భానుక రాజపక్స కోల్‌కతాను ఉతికి ఆరేసి పంజాబ్‌ను భారీ స్కోరుకు చేర్చాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ స్వింగ్ బౌలింగ్‌లో భయపెట్టి కేకేఆర్ టాప్ ఆర్డర్‌ను నాశనం చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కోల్‌కతా ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటింగ్‌లో పేలవమైన ఆరంభం తర్వాత వెంకటేష్ అయ్యర్ (34), ఆండ్రీ రస్సెల్ (35) జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. 14వ ఓవర్ తర్వాత తేలికపాటి వర్షం ప్రారంభమైంది. ఈ సమయానికి DLS నియమం ప్రకారం కోల్‌కతా ఢిల్లీ కంటే 10 పరుగులు వెనుకబడి ఉంది. తర్వాతి రెండు ఓవర్లలో రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ 3 సిక్సర్లు, 1 ఫోర్ బాదారు. అయితే ఈ సమయంలో రస్సెల్, అయ్యర్ పెవిలియన్ చేరారు. దీంతో ఓటమి ఖాయమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..