SRH vs RR: ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్.. ఉప్పల్ మ్యాచ్‌‌ల కోసం రైళ్ల సంఖ్య పెంపు..

భాగ్యనగరంలో ఐపీఎల్‌ సందడి జోరందుకుంది. ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌‌తో తలపడేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీం సిద్ధమైంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభంకానుంది. ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

SRH vs RR: ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్.. ఉప్పల్ మ్యాచ్‌‌ల కోసం రైళ్ల సంఖ్య పెంపు..
Hyderabad Metro
Follow us
Venkata Chari

|

Updated on: Apr 01, 2023 | 9:40 PM

భాగ్యనగరంలో ఐపీఎల్‌ సందడి జోరందుకుంది. ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌‌తో తలపడేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీం సిద్ధమైంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభంకానుంది. ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో రేపు (ఆదివారం) జరిగే మ్యాచ్‌ కోసం అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. మ్యాచ్ కోసం వచ్చే అభిమానుల కోసం మెట్రో రైళ్లను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

నాగోల్‌-అమీర్‌పేట రూట్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ మేరకు రైళ్ల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే మెట్రో రైళ్లను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పెంచుతున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..