LSG vs DC Live Score: బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. టార్గెట్ ఎంతంటే?

Venkata Chari

|

Updated on: Apr 02, 2023 | 9:42 PM

Lucknow Super giants vs Delhi Capitals IPL 2023 Live Score in Telugu: ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది కారు ప్రమాదంలో గాయపడ్డాడు. అందుకే డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

LSG vs DC Live Score: బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. టార్గెట్ ఎంతంటే?
Lsg Vs Dc Live Score

LSG vs DC Live Score: ఓపెనర్ కైల్ మేయర్స్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆధారంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్‌జెయింట్ 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

కరీబియన్ బ్యాట్స్‌మెన్ కైల్ మేయర్స్ 38 బంతుల్లో 7 సిక్సర్లతో 73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యలో నికోలస్ పూరన్ 21 బంతుల్లో మూడు సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి కూడా IPL టైటిల్ గెలవలేదు. ఈ జట్టు 2020లో తొలిసారి ఫైనల్ ఆడింది. అయితే టైటిల్ మ్యాచ్‌లో ఈ జట్టు ముంబై చేతిలో ఓడిపోయింది. ఈసారి తొలి టైటిల్ సాధించాలన్నదే ఢిల్లీ ప్రయత్నం. ఈసారి ఈ జట్టు కొత్త కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో వస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గత సీజన్‌లో తొలిసారి ఐపీఎల్ ఆడింది. తొలి సీజన్‌లోనే ఈ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని జట్టు ఈసారి విజయంతో శుభారంభం చేయాలని, టైటిల్ గెలవాలని కోరుకుంటోంది.

రెండు జట్ల ప్లేయింగ్-11, ఇంపాక్ట్ ప్లేయర్‌లు..

లక్నో సూపర్‌జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(కీపర్), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

ఇంపాక్ట్ ప్లేయర్స్: మనన్ వోహ్రా, కృష్ణప్ప గౌతమ్, స్వప్నిల్ శర్మ, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (కీపర్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

ఇంపాక్ట్ ప్లేయర్స్: ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, లలిత్ యాదవ్, అమన్ ఖాన్, యశ్ ధుల్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 01 Apr 2023 09:43 PM (IST)

    రెండు ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ టీం 24 పరుగులు చేసింది. షా 6 పరుగులు, వార్నర్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 01 Apr 2023 09:24 PM (IST)

    ఢిల్లీ టార్గెట్ 194..

    ఓపెనర్ కైల్ మేయర్స్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆధారంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్‌జెయింట్ 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

  • 01 Apr 2023 08:30 PM (IST)

    12 ఓవర్లు ముగిసే సరికి..

    12 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు సాధించింది. పాండ్యా 1, స్టోయినీస్ 2 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 01 Apr 2023 07:54 PM (IST)

    రాహుల్ ఔట్..

    చేతన్ సకారియా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్(8) పెవిలియన్ చేరాడు. దీంతో 19 పరుగుల వద్ద లక్నో టీం తొలి వికెట్ కోల్పోయింది.

  • 01 Apr 2023 07:17 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI:

    ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (కీపర్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

  • 01 Apr 2023 07:16 PM (IST)

    లక్నో సూపర్‌జెయింట్స్ ప్లేయింగ్ XI:

    లక్నో సూపర్‌జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(కీపర్), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

  • 01 Apr 2023 07:12 PM (IST)

    IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ..

    ఢిల్లీ టీం టాస్ గెలిచి, తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో టీం తొలుత బౌలింగ్ చేయనుంది.

  • 01 Apr 2023 06:57 PM (IST)

    DC vs LSG: విజయంతో ప్రారంభించేది ఎవరో…

    ఐపీఎల్‌లో ఈరోజు తొలి డబుల్ హెడర్‌. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్‌జెయింట్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు విజయంతో ప్రారంభించాలని కోరుకుంటున్నాయి. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 2016లో టైటిల్ గెలిచిన కొత్త కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఢిల్లీ వెళుతోంది.

Published On - Apr 01,2023 6:55 PM

Follow us