AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో బుమ్రానే సుస్సుపోయించాడు..

ఐపీఎల్ 2024లో మొహలి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ యువ బ్యాట్స్‌మెన్ అశుతోష్ శర్మ పవర్‌ హిట్టింగ్ ఫ్యాన్స్ అందరినీ ఉర్రూతలూగించింది. డెబ్యూ సీజన్ ఆడుతోన్న అశుతోష్ శర్మ.. ముంబై ఇండియన్స్ బౌలర్లను గ్రౌండ్ నలువైపులా చితక్కొట్టాడు.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో బుమ్రానే సుస్సుపోయించాడు..
Ipl 2024
Ravi Kiran
|

Updated on: Apr 19, 2024 | 11:30 AM

Share

ఐపీఎల్ 2024లో మొహలి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ యువ బ్యాట్స్‌మెన్ అశుతోష్ శర్మ పవర్‌ హిట్టింగ్ ఫ్యాన్స్ అందరినీ ఉర్రూతలూగించింది. డెబ్యూ సీజన్ ఆడుతోన్న అశుతోష్ శర్మ.. ముంబై ఇండియన్స్ బౌలర్లను గ్రౌండ్ నలువైపులా చితక్కొట్టాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశుతోష్ శర్మ తన అదిరిపోయే బ్యాటింగ్‌తో ముంబై శిబిరంలో భయభ్రాంతులు సృష్టించారు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అశుతోష్.. మొత్తంగా 28 బంతులాడి 61 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు బాదేశాడు.

ప్రతీ మ్యాచ్ మాదిరిగానే అశుతోష్ శర్మ ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ యథావిధిగా క్రీజులోకి వచ్చిరాగానే బౌలర్లను ఉతికి ఆరేయడం మొదలుపెట్టాడు. 10వ ఓవర్లో జితేష్ శర్మ ఔటైన తర్వాత అశుతోష్ శర్మ క్రీజులోకి వచ్చాడు. ఈ ఆటగాడు తన రెండో బంతికే ఆకాష్ మధ్వల్ వేసిన బంతిని ఫైన్ లెగ్‌లో సిక్స్ కొట్టాడు. దీని తర్వాత ప్రతి ఓవర్‌లో ఒక సిక్స్ లేదా ఫోర్ కొడుతూ వచ్చాడు అశుతోష్. ఇలా కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. దాదాపుగా పంజాబ్‌కి విజయాన్ని అందిస్తాడన్న తరుణంలో.. 18వ ఓవర్లో పెవిలియన్‌కు చేరాడు అశుతోష్.

పంజాబ్ కింగ్స్ కేవలం రూ. 20 లక్షలకే అశుతోష్‌ శర్మకు కొనుగోలు చేసింది. అతడికి ఇదే తొలి ఐపీఎల్ సీజన్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ రైల్వేస్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలోనే గతేడాది యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. అశుతోష్ కేవలం 11 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ ఘనతతో అతడికి ఎక్కడాలేని పేరు ప్రఖ్యాతలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా ఈ ఆటగాడు తన తుఫాను హిట్టింగ్‌తో మంచి గుర్తింపు సాధించాడు. ఈ సీజన్‌లో అశుతోష్ 13 సిక్సర్లతో 156 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 200కిపైగా ఉంది. ఇదే ఫామ్ కొనసాగితే.. మరికొన్ని రోజుల్లో అశుతోష్ టీమిండియా తరపున అరంగేట్రం చేయడం కన్ఫామ్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

Follow Us