ఐపీఎల్, బీసీసీఐ వద్దని ఛీ కొట్టినా.. కట్‌చేస్తే.. బ్యాడ్‌లక్ ప్లేయర్‌కు వెల్ కం చెప్పిన చెన్నై కెప్టెన్
Prithvi Shaw: సోమవారం ముంబై క్రికెట్ జట్టుతో తన సంబంధానికి పృథ్వీ షా ముగింపు పలికాడు. ఇప్పుడు అతను కొత్త జట్టులో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షాకు 3 జట్ల నుంచి ఆఫర్లు వచ్చాయంట. ఏ జట్టులో చేరుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Prithvi Shaw: టీమిండియాకు దూరంగా ఉన్న పృథ్వీ షా ముంబై రంజీ జట్టును విడిచిపెట్టాడు. ఇప్పుడు అతను వచ్చే సీజన్ నుంచి వేరే జట్టుకు ఆడటం కనిపిస్తుంది. ఈ టీమిండియా బ్యాడ్ లక్ ప్లేయర్‌కు 3 జట్ల నుంచి ఆఫర్లు వచ్చాయని నివేదికలు వినిపించాయి. కానీ, అతను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆడటం చూడొచ్చు. ఎందుకంటే, తదుపరి దేశీయ సీజన్‌లో పృథ్వీ షా మహారాష్ట్ర తరపున ఆడటం చూడవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర కెప్టెన్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు.
పృథ్వీ షా, ముంబై మధ్య తెగిన సంబంధం..
సోమవారం ముంబై క్రికెట్ అసోసియేషన్ తో తన సంబంధాలను పృథ్వీ షా తెంచుకున్నాడు. జట్టును విడిచిపెట్టడానికి NOC కోరుతూ ఆ ఆటగాడు MCA కి ఈ-మెయిల్ పంపిన సంగతి తెలిసిందే. సాయంత్రానికి అతనికి అనుమతి లభించింది. పృథ్వీ షా ముంబై క్రికెట్ జట్టుతో తన కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అండర్ -19 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత స్టార్‌గా మారాడు. తన తొలి రంజీ మ్యాచ్ లోనే తమిళనాడుతో జరిగిన రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు.
పృథ్వీ షా కెరీర్‌కు రెక్కలు వస్తాయా?
గత 2-3 సంవత్సరాలుగా పృథ్వీ షా కెరీర్ క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ ఆటగాడిని ఒకప్పుడు టీం ఇండియా తదుపరి స్టార్‌గా పరిగణించేవారు. కానీ, ఇప్పుడు పృథ్వీ షా ఐపీఎల్, టీం ఇండియాకు దూరమయ్యాడు. మొదట షాను టీం ఇండియా నుంచి తొలగించారు. ఆ తర్వాత ముంబై జట్టు నుంచి కూడా బయటకు పంపారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కూడా ఎవరూ అతన్ని కొనుగోలు చేయలేదు. దీనికి కారణం అతని పేలవమైన ఫిట్‌నెస్. అతని శరీరంలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉందని, దీనిని కారణంగా చూపుతూ ముంబై సెలెక్టర్లు అతన్ని జట్టు నుంచి తొలగించారని వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు ఈ ఆటగాడు తన ఫిట్‌నెస్‌పై పని చేస్తున్నాడు. ఇప్పుడు అతను మహారాష్ట్ర జట్టుతో ఎలా రాణిస్తాడో చూడాలి.
పృథ్వీ షా కెరీర్..
పృథ్వీ షా ఫస్ట్ క్లాస్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే, ఈ 25 ఏళ్ల ఆటగాడు 58 మ్యాచ్‌ల్లో 46 కంటే ఎక్కువ సగటుతో 4556 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉన్నాయి. షా లిస్ట్ ఏ క్రికెట్‌లో 10 సెంచరీల సహాయంతో 3399 పరుగులు చేశాడు. ఈ ఆటగాడు టీ20లో కూడా 2902 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








