Telugu News Sports News Cricket news PM Narendra Modi, Amitshah, Rahul Gandhi congratulated Team india for winning against Pakistan in Asia Cup 2022
Ind Vs Pak: పాక్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ.. ప్రధాని మోడీ, రాహుల్, అమిత్‌షా ఏమన్నారంటే?
PM Narendra Modi: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో దాయాదిని చిత్తు చేసింది.
PM Narendra Modi: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో దాయాదిని చిత్తు చేసింది. తద్వారా గతేడాది ఇదే వేదికపై టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. కాగా చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించడంతో దేశమంతా సంబరాలు అంబరాన్నంటాయి. చాలాచోట్ల అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి మువ్వెన్నెల జెండాను పట్టుకుని బైక్‌లపై ర్యాలీలు తీశారు. ఇక హైదరాబాద్ లో యువకులు స్వీట్లు పంచుతూ.. జాతీయ నినాదాలతో హోరెత్తించారు. కాగా టీమిండియా విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) కూడా స్పందించారు. భారత జట్టు ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘భారత్ ఈ రోజు అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. గొప్ప నైపుణ్యాన్ని కనబరిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియాకు కంగ్రాట్స్’ అని అందులో రాసుకొచ్చారు.
#TeamIndia put up a spectacular all-round performance in today’s #AsiaCup2022 match. The team has displayed superb skill and grit. Congratulations to them on the victory.
A high voltage contest these #INDvPAK games, and the boys have shown tremendous composure and character. Very well played to begin the Asia Cup with a remarkable win.#AsiaCup2022pic.twitter.com/Awidw6WPFD