AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: భారత్, పాక్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీ20 సిరీస్.. ఎప్పుడు, ఎక్కడంటే?

India vs Pakistan T20 Series: 2012-13 నుంచి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఈ రెండు జట్లు ప్రపంచ కప్, ఆసియా కప్ లేదా ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే పోటీపడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య సిరీస్ ఆడేందుకు చాలాసార్లు చర్చలు జరిగినా ఈసారి ఈ ప్లానింగ్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

IND vs PAK: భారత్, పాక్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీ20 సిరీస్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Jul 22, 2024 | 9:02 AM

Share

India vs Pakistan T20 Series: పాకిస్థాన్ క్రికెట్‌ తమ మాటలతో సెన్సెషన్ చేస్తుంటుంది. భారత జట్టును ఓడించి ప్రకంపనలు సృష్టిస్తామని కొన్నిసార్లు.. మరోసారి ఐసీసీలో ప్రకంపనలు సృష్టిస్తామని పాక్ క్రికెట్ బోర్డు అధికారులతోపాటు ఆటగాళ్లు కలలు కంటుంటారు. ముఖ్యంగా భారత జట్టు లేదా BCCI విషయంలో పీసీబీ పిచ్చి దావాలంలా వ్యాపిస్తుంది. ఈసారి కూడా అలాంటిదే జరుగుతోంది. పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనే విషయంపై ఓ వైపు స్పష్టత రాకపోగా, మరోవైపు భారత్‌తో నేరుగా సిరీస్ ఆడేందుకు పీసీబీ ప్రయత్నిస్తోంది.

గత కొన్నేళ్లుగా భారత్-పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలు క్షీణించడంతో, ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. 2012-13లో ఇరు దేశాల మధ్య చివరి వన్డే సిరీస్ జరగగా, దాని కోసం పాక్ జట్టు భారత్‌కు వచ్చింది. కానీ, భారతదేశంలో ఉగ్రవాద సంఘటనలకు పాకిస్తాన్ బహిరంగ మద్దతు ఇచ్చిన తర్వాత నిషేధిం విధించారు. ఇప్పుడు రెండు జట్లు ప్రపంచ కప్-ఆసియా కప్ వంటి టోర్నమెంట్లలో మాత్రమే ఢీకొంటున్నాయి.

భారత్-పాకిస్థాన్ టీ20 సిరీస్ ఆడనుందా?

రెండు దేశాల మధ్య సిరీస్‌ను పునఃప్రారంభించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ త్వరలో టీ20 సిరీస్ ఆడేందుకు భారత జట్టును ఆహ్వానించబోతున్నట్లు ఒక నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయంలో నఖ్వీ బీసీసీఐ సెక్రటరీ జైషాను కలుస్తారని, వచ్చే ఏడాది తటస్థ వేదికలో ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్‌ను ఆడాలని ప్రతిపాదిస్తారని నివేదిక పేర్కొంది. శ్రీలంకలో రెండు బోర్డుల కీలక అధికారుల మధ్య సమావేశం జరగవచ్చు. అక్కడ వారందరూ ICC కీలక సమావేశానికి హాజరవుతారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ సిరీస్ ఆడాలని పాకిస్థాన్ బోర్డు ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీపై దృష్టి..

ప్రస్తుతానికి దీనిని ‘పగటి కలలు’ అని మాత్రమే పిలవవచ్చు. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం ప్రస్తుతం సుదూర కలగా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా సొంత దేశంలో నిర్వహించడం పాకిస్థాన్ ముందున్న మొదటి పెద్ద సవాలుగా మారింది. 2025 ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఈ 8 దేశాల టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. భద్రతా కారణాల దృష్ట్యా గత కొన్నేళ్లుగా టీమ్‌ఇండియాను పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ కారణంగా గత ఏడాది పాకిస్థాన్‌తో పాటు శ్రీలంకలో కూడా ఆసియా కప్‌ను నిర్వహించింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అదే పరిస్థితిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికి భారత ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునే అవకాశం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..