AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: 10 సిక్సర్లు, 9 ఫోర్లతో సూపర్ సెంచరీ.. 6గురి బౌలర్ల ఊచకోత.. టీ20ల్లో బ్రేకుల్లేని బుల్డోజర్.. ఎవరంటే!

T20 Blast 2022: టీ20 మ్యాచ్ ఏదైనా కూడా ప్రేక్షకులకు కావాల్సినంత మజా ఇస్తుంది. ఆయా మ్యాచ్‌లలో బ్యాటర్లు పైచేయి సాధిస్తూ.. బౌలర్లను బౌండరీలతో ఉతికారేస్తుంటే.. ఫ్యాన్స్ పోడియంలలో..

Cricket: 10 సిక్సర్లు, 9 ఫోర్లతో సూపర్ సెంచరీ.. 6గురి బౌలర్ల ఊచకోత.. టీ20ల్లో బ్రేకుల్లేని బుల్డోజర్.. ఎవరంటే!
Paul Stirling
Ravi Kiran
|

Updated on: May 27, 2022 | 11:05 AM

Share

టీ20 మ్యాచ్ ఏదైనా కూడా ప్రేక్షకులకు కావాల్సినంత మజా ఇస్తుంది. ఆయా మ్యాచ్‌లలో బ్యాటర్లు పైచేయి సాధిస్తూ.. బౌలర్లను బౌండరీలతో ఉతికారేస్తుంటే.. ఫ్యాన్స్ పోడియంలలో కూర్చుని కేరింతలతో మరింత బూస్ట్ ఇస్తుంటారు. ఒకవైపు ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంటే, మరోవైపు ఇంగ్లాండ్‌లో టీ20 బ్లాస్ట్ ఇప్పుడే ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ 4వ మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మెన్ బౌండరీల వర్షంతో బౌలర్లను ఊచకోత కోశాడు. ఫ్యాన్స్ ముద్దుగా అతడిని బ్రేకుల్లేని బుల్డోజర్‌లా పిలుస్తుంటారు. మరి, ఆ బ్యాటర్ ఎవరో? ఆ మ్యాచ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంగ్లాండ్‌ టీ20 బ్లాస్ట్‌ 4వ మ్యాచ్‌లో వార్‌విక్‌షైర్‌, నార్తాంప్టన్‌షైర్ జట్లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో వార్‌విక్‌షైర్‌ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. సూపర్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. 51 బంతులు ఎదుర్కున్న స్టిర్లింగ్ 10 సిక్సర్లు, 9 ఫోర్లతో 119 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ బెథెల్(5), డేవిస్(7) వెనువెంటనే పెవిలియన్ చేరినప్పటికీ.. స్టిర్లింగ్ ఒకవైపు నుంచి పరుగుల వరద పారించాడు. సామ్ హయిన్(66)తో కలిసి మూడో వికెట్‌కు 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హాయిన్ 32 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

పాల్‌ స్టిర్లింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్…

డొమెస్టిక్ టీ20ల్లో అద్భుత ఫామ్ కొనసాగిస్తున్న పాల్ స్టిర్లింగ్ మరోసారి తన దూకుడైన ఆటతీరును ప్రదర్శించాడు. నార్తాంప్టన్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 233.33 స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన సెంచరీ సాధించాడు. స్టిర్లింగ్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. స్టిర్లింగ్‌ను పెవిలియన్ పంపించేందుకు ప్రత్యర్థి జట్టు 7గురు బౌలర్లను రంగంలోకి దింపగా.. వాళ్లను బౌండరీలతో దంచికొట్టేశాడు. స్టిర్లింగ్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్ల ఎకానమీ రేట్ 8 దాటేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

చతికిలబడ్డ నార్తాంప్టన్‌షైర్…

భారీ లక్ష్యఛేదనలో భాగంగా బరిలోకి దిగిన నార్తాంప్టన్‌షైర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆ జట్టు 81 పరుగులకే ఆలౌట్ అయింది. ముగ్గురు బ్యాటర్లు రెండంకెల స్కోర్లు దాటగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. వార్‌విక్‌షైర్‌ బౌలర్లలో డానీ బ్రిగ్స్, జాక్ లింటోట్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. హెన్రీ బ్రూక్స్ 2 వికెట్లు.. బ్రాత్‌వైట్, మైల్స్ ఒక్కో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్‌లో వార్‌విక్‌షైర్‌ 125 పరుగుల తేడాతో విజయం సాధించింది.