AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Records: జడేజాను మించిన పాకిస్థాన్ బౌలర్లు.. క్రికెట్ చరిత్రలో ఎవరూ చేయని విచిత్రమైన రికార్డు

Cricket Records: 2026లో పాకిస్థాన్ బౌలర్లు టెస్టు క్రికెట్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన జట్టుగా నిలిచారు. ఆరు టెస్టుల్లో ఏకంగా 61 నో బాల్స్ వేశారు. పేసర్ ఖుర్రమ్ షెహజాద్ ఒక్కడే నాలుగు టెస్టుల్లో 34 నో బాల్స్‌తో సంచలన రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ టెస్టులోనూ పాక్ బౌలర్ల నో బాల్స్ కొనసాగాయి.

Cricket Records: జడేజాను మించిన పాకిస్థాన్ బౌలర్లు.. క్రికెట్ చరిత్రలో ఎవరూ చేయని విచిత్రమైన రికార్డు
Cricket Records
Rakesh
|

Updated on: Aug 28, 2026 | 11:53 AM

Share

Cricket Records: క్రికెట్ మైదానంలో రూల్స్ ఉల్లంఘిస్తూ నో బాల్స్ వేయడంలో పాకిస్థాన్ బౌలర్లు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. 2026 సంవత్సరంలో కేవలం 6 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు ఏకంగా 61 నో బాల్స్ వేసి తీవ్ర విమర్శల పాలవుతోంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ బౌలర్లు తమ పాత అలవాటును కొనసాగించారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2021 నుంచి టెస్టుల్లో 88 నో బాల్స్ వేశాడని ఇటీవల గణాంకాలు రాగా విమర్శలు వచ్చాయి. అయితే ఇంగ్లాండ్-పాకిస్థాన్ టెస్టు సిరీస్‌లో పాక్ బౌలర్లు వేసిన నో బాల్స్ చూస్తే జడేజా లెక్కలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో పాకిస్థాన్ 9 వికెట్లు తీసి మంచి పట్టు సాధించినప్పటికీ, ఏకంగా 10 నో బాల్స్ వేసి తమ క్రమశిక్షణా రాహిత్యాన్ని బయటపెట్టుకుంది.

అత్యధిక నో బాల్స్ వేసిన జట్టుగా పాకిస్థాన్

2026 క్యాలెండర్ ఇయర్ గణాంకాలు పరిశీలిస్తే పాకిస్థాన్ బౌలింగ్ విభాగం ఘోరమైన రికార్డును నమోదు చేసింది. ఆడిన 6 మ్యాచ్‌ల్లోనే 61 నో బాల్స్ విసిరారు. ఈ జాబితాలో వెస్టిండీస్ 38 నో బాల్స్‌తో రెండో స్థానంలో ఉంటే, పాకిస్థాన్ దానికి ఆమడ దూరంలో అగ్రస్థానంలో నిలిచింది. పాక్ బౌలర్లు ప్రతి 80 బంతులకు (అంటే ప్రతి 13.2 ఓవర్లకు) ఒక నో బాల్ చొప్పున బౌలింగ్ చేయడం క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పరిమితి దాటి నో బాల్స్

పాకిస్థాన్ పేసర్ ఖుర్రమ్ షెహజాద్ మైదానంలో పరిమితి దాటి మరీ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన 4 టెస్టుల్లోనే ఇతను ఏకంగా 34 నో బాల్స్ వేశాడు. వెస్టిండీస్ జట్టు మొత్తం కలిపి వేసిన నో బాల్స్ కంటే ఖుర్రమ్ ఒక్కడే వేసిన నో బాల్స్ సంఖ్య కేవలం 4 మాత్రమే తక్కువగా ఉండటం గమనార్హం. ప్రతి 20 లీగల్ బంతులకు (3.2 ఓవర్లకు) ఒక నో బాల్ వేస్తూ ఇతను అత్యంత దారుణమైన సగటును నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌పై ఆడుతున్న ప్రస్తుత టెస్టులోనూ ఇప్పటికే 5 నో బాల్స్ విసిరాడు.

లార్డ్స్ టెస్టు తొలి రోజు ఆట తీరు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ను ప్రారంభంలో పాక్ బౌలర్లు గట్టిగా దెబ్బతీశారు. 36 పరుగులకే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌తో సహా టాప్-3 వికెట్లను పెవిలియన్ పంపించారు. ఒక దశలో 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జార్డన్ కాక్స్ (55), జేమీ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు, మహమ్మద్ అలీ 3 వికెట్లు పడగొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us