IND vs PAK: భారత బౌలర్ల ధాటికి పాక్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
India vs Pakistan, 12th Match: పాక్‌పై టాస్ గెలిచి బౌలింగ్ చేయాలనే నిర్ణయం భారత్‌కు సరైనదని రుజువైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 191 పరుగులకు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసింది. సిరాజ్, బుమ్రా, హార్దిక్, కుల్దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు.

India vs Pakistan, 12th Match: పాక్‌పై టాస్ గెలిచి బౌలింగ్ చేయాలనే నిర్ణయం భారత్‌కు సరైనదని రుజువైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 191 పరుగులకు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసింది. సిరాజ్, బుమ్రా, హార్దిక్, కుల్దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు.
పాక్ తరపున కెప్టెన్ బాబర్ ఆజం అర్ధశతకం సాధించాడు. వన్డేల్లో భారత్‌పై అతనికిదే తొలి అర్ధశతకం. 49 పరుగుల వద్ద రిజ్వాన్ ఔటయ్యాడు.
తొలుత 155 పరుగుల స్కోరు వద్ద పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బాబర్ అజామ్ పెవిలియన్ చేరాడు. బాబర్ పెవిలియన్‌కు వెళ్లిన తర్వాత వికెట్ల వర్షం కురిసింది. 33వ ఓవర్లో సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్ వికెట్లను కుల్దీప్ యాదవ్ తీయగా.. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 34వ ఓవర్లో మహ్మద్ రిజ్వాన్‌ను, 36వ ఓవర్‌లో షాదాబ్ ఖాన్‌ను బౌల్డ్ చేశాడు. హార్దిక్ పాండ్యా మహ్మద్ నవాజ్ క్యాచ్ ఔట్‌తో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా హసన్ అలీ, హరీస్ రవూఫ్‌లను అవుట్ చేశాడు. ఓ దశలో భారీ స్కోర్ సాధిస్తుందని అనుకున్నా.. ఆ జట్టు 36 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో కూరుకపోయింది. దీంతో కేవలం 42.5 ఓవర్లలో పాకిస్థాన్ 191 పరుగులకే ఆలౌట్ అయింది.
View this post on Instagram
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
View this post on Instagram
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..