IND vs PAK, Virat Kohli: పాకిస్తాన్ మ్యాచ్‌లో కోహ్లీ భారీ తప్పిదం.. కట్‌చేస్తే.. మైదానం వీడిన కింగ్.. ఎందుకంటే?
IND vs PAK, World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పాక్‌పై భారత్ 6 వికెట్లు పడగొట్టింది. సిరాజ్, కుల్దీప్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. రిజ్వాన్ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రపంచకప్ 2023లో తొలి అర్ధ సెంచరీ చేసిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అవుటయ్యాడు.

IND vs PAK, World Cup 2023: అహ్మదాబాద్‌లో శనివారం జరుగుతోన్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడుతోంది. అయితే, భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ జెర్సీ కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో కోహ్లీ కొద్దిసేపు టీమిండియా డగౌట్‌కి వెళ్లి, మరలా మార్చుకుని మైదానంలోకి వచ్చాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా ఆటగాళ్లు మైదానంలోకి దిగినప్పుడు భుజాలపై భారత జెండాలోని మూడు రంగుల చారలను ప్రదర్శించే జెర్సీలను ధరిస్తుంటారు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం భుజాలపై సాదా తెల్లటి చారలతో కూడిన జెర్సీతో మైదానంలోకి వచ్చాడు.
దీంతో ఏడో ఓవర్‌లో ఇదిగమనించిన విరాట్ కోహ్లీ వెంటనే మైదానాన్ని విడిచిపెట్టాడు. అనంతరం ఎనిమిదో ఓవర్‌ల్లో జెర్సీని మార్చుకుని వచ్చాడు.
Virat Kohli mistakenly wore the wrong jersey (Tri Colour strap missing.) He got the right one as soon as he realised.
#INDvsPAK pic.twitter.com/fnvzulpUXm
— Syed Jaffer🇮🇳 (@writopath) October 14, 2023
ఎనిమిదో ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న పాకిస్తాన్ నిర్ణీత 35 ఓవర్లు మిగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
సచిన్‌ను కలిసిన సమయంలో జెర్సీలో మార్పు..
View this post on Instagram
వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పాక్‌పై భారత్ 6 వికెట్లు పడగొట్టింది.
Virat Kohli ridicules Mohammad Rizwan for wasting time during India-Pakistan World Cup clash – WATCH
READ – https://t.co/GQfsKM6Iyc#IndvsPak #ICCWorldCup #viratkohli pic.twitter.com/gtpXI6Wn8L
— R.Sport (@republic_sports) October 14, 2023
సిరాజ్, కుల్దీప్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. రిజ్వాన్ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రపంచకప్ 2023లో తొలి అర్ధ సెంచరీ చేసిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అవుటయ్యాడు.
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..