13 ఫోర్లు, 4 సిక్స్‌లు.. తుఫాన్ సెంచరీతో బీభత్సం భయ్యో.. ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్

New Zealand vs Sri Lanka, 3rd T20I: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 ఇంటర్నేషనల్‌లో కుశాల్ పెరీరా తన కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. దీంతో 14 ఏళ్ల రికార్డు కూడా బద్దలైంది. తన తొలి టీ20 సెంచరీ సాధించడం ద్వారా శ్రీలంక క్రికెట్ చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నాడు.

13 ఫోర్లు, 4 సిక్స్‌లు.. తుఫాన్ సెంచరీతో బీభత్సం భయ్యో.. ఫాస్టెస్ట్ సెంచరీతో 14 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్
Kusal Perera T20i Century
Follow us
Venkata Chari

|

Updated on: Jan 02, 2025 | 8:52 AM

Kusal Perera T20I Century: కొత్త ఏడాది తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే కుశాల్ పెరీరా రెచ్చిపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అతను తుఫాను సెంచరీ సాధించాడు. పెరీరా చేసిన ఈ సెంచరీ అంతర్జాతీయ టీ20లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీగా మారింది. కేవలం 44 బంతుల్లోనే తన టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ స్క్రిప్ట్‌ను రాసుకున్నాడు. 219.56 స్ట్రైక్ రేట్‌తో ఆడిన కుసల్ పెరీరా సెంచరీ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. విశేషమేమిటంటే.. కుశాల్ పెరీరా టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ.

14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కుశాల్ పెరీరా..

కుశాల్ పెరీరా తన వేగవంతమైన తుఫాన్ సెంచరీతో 14 ఏళ్ల శ్రీలంక రికార్డును కూడా బద్దలు కొట్టాడు. నిజానికి 44 బంతుల్లోనే టీ20లో సెంచరీ సాధించి ఈ విషయంలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌ కాకపోవచ్చు. కానీ, శ్రీలంక ఆటగాళ్లు కచ్చితంగా క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన తిలకరత్నే దిల్షాన్ రికార్డును బద్దలు కొట్టాడు. 2011లో ఆస్ట్రేలియాపై దిల్షాన్ 55 బంతుల్లో సెంచరీ సాధించాడు.

2025 సంవత్సరంలో తొలి సెంచరీ..

శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టీ20 2025లో తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో సెంచరీతో పాటు పరుగుల వర్షం కూడా కురిసింది. 2025లో అంతర్జాతీయ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కుశాల్ పెరీరా నిలిచాడు. వార్త రాసే సమయానికి న్యూజిలాండ్ జట్టు వికెట్ నష్టోపోకుండా 7 ఓవర్లలో 80 పరుగులు సాధించింది. క్రీజులో రచిన్ రవీంద్ర 40, టిమ్ రాబిన్ సన్ 37 పరుగులతో నిలిచారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..