ఇదేందయ్యా ఇది.. 25 సిక్సర్లు, 429 పరుగులు.. టీ20ల్లో బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఇదేనేమో..

New Zealand vs Sri Lanka, 3rd T20I: 2025 సంవత్సరంలో జరిగే తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. చివరి వరకు ఉత్కంఠగాసాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించి, ఔరా అనిపింది.

ఇదేందయ్యా ఇది.. 25 సిక్సర్లు, 429 పరుగులు.. టీ20ల్లో బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఇదేనేమో..
Nz Vs Sl 3rd T20i
Follow us
Venkata Chari

|

Updated on: Jan 02, 2025 | 10:25 AM

New Zealand vs Sri Lanka, 3rd T20I: న్యూజిలాండ్ గడ్డపై 2025లో జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో బంతికి, బ్యాట్‌కు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి బాల్ వరకు ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌ చూసిన థ్రిల్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతి వరకు గెలుపు ఇరు జట్లతో ఆడుకుంది. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురవడంతో పాటు పరుగుల పర్వం కూడా కురిసింది. చివరికి, శ్రీలంక జట్టు తన అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

NZ vs SL మ్యాచ్‌లో 429 పరుగులతో రికార్డ్..

న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న 3వ టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారీ స్కోరు ఉన్నప్పటికీ గెలుపు ఓటము మధ్య తేడా కేవలం 7 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. బదులిచ్చిన న్యూజిలాండ్ జట్టు కూడా లక్ష్యానికి 7 పరుగుల దూరంలోనే మిగిలిపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ విధంగా రెండు జట్లు 429 పరుగులు నమోదు చేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో మొత్తం స్కోర్లు నమోదయ్యాయి.

శ్రీలంక తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన కుశాల్ పెరీరా..

ముందుగా ఆడిన శ్రీలంక జట్టు 218 పరుగులు చేయగలిగింది. ఎందుకంటే, లంక తరపున కుశాల్ పెరీరా పరుగుల వర్షం కురిపించాడు. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసి శ్రీలంక తరపున సరికొత్త రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌పై కుశాల్ పెరీరా 45 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను కేవలం 44 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంక తరపున అత్యంత వేగవంతమైన T20I సెంచరీ పరంగా, పెరీరా 2011లో దిల్షాన్ 55 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును బద్దలు కొట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..