IND vs ENG: రాహుల్, సుదర్శన్ కాదు.. యశస్వితో ఓపెనింగ్‌కి సిద్ధమైన 37 సెంచరీల ప్లేయర్.. ఎవరంటే?
రోహిత్ పదవీ విరమణ తర్వాత, ఇంగ్లాండ్‌లో టీం ఇండియా ఇన్నింగ్స్ (IND vs ENG) ను కేఎల్ రాహుల్ లేదా సాయి సుదర్శన్ ప్రారంభించకపోవచ్చు. కానీ, బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడే ఆటగాడు ప్రారంభించవచ్చు. ఈ ఆటగాడు ఇప్పటివరకు తన దేశీయ కెరీర్‌లో 37 సెంచరీలు సాధించాడు.

IND vs ENG: భారత్ వచ్చే నెల జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో, రెండు జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. దీనికి ముందు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అధికారికంగా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మే 7న, మొదట రోహిత్ శర్మ క్రికెట్ సుధీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిని సంగతి తెలిసిందే. ఐదు రోజుల తర్వాత కోహ్లీ కూడా రిటైర్ కావడం ద్వారా క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు.
రోహిత్ పదవీ విరమణ తర్వాత, ఇంగ్లాండ్‌లో టీం ఇండియా ఇన్నింగ్స్ (IND vs ENG) ను కేఎల్ రాహుల్ లేదా సాయి సుదర్శన్ ప్రారంభించకపోవచ్చు. కానీ, బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడే ఆటగాడు ప్రారంభించవచ్చు. ఈ ఆటగాడు ఇప్పటివరకు తన దేశీయ కెరీర్‌లో 37 సెంచరీలు సాధించాడు.
ఈ ఆటగాడు IND vs ENG సిరీస్‌లో ఓపెనర్‌గా..
వచ్చే నెలలో ఇంగ్లాండ్ గడ్డపై ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ (IND vs ENG)లో, కేఎల్ రాహుల్ లేదా సాయి సుదర్శన్ కాకుండా యశస్వి జైస్వాల్‌తో కలిసి అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం చూడొచ్చు. అభిమన్యు చాలా కాలంగా టీం ఇండియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కానీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో అతనికి టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. కానీ, ఇప్పుడు రోహిత్ రిటైర్మెంట్ తర్వాత, అభిమన్యు ఈశ్వరన్ ఇంగ్లాండ్‌లో టీం ఇండియా తరపున ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఆటగాడు ఇప్పటివరకు దేశీయ క్రికెట్‌లో 37 సెంచరీలు చేశాడు.
101 మ్యాచ్‌లు..
అభిమన్యు ఈశ్వరన్ 2013లో బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కానీ, 12 సంవత్సరాల తర్వాత కూడా అతనికి టీమ్ ఇండియాలో అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. 29 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటివరకు బెంగాల్ తరపున 101 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 173 ఇన్నింగ్స్‌లలో 48.87 సగటుతో 7674 పరుగులు చేశాడు. ఈ కాలంలో, అతని బ్యాట్ నుంచి 27 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు వచ్చాయి.
ఇది కాకుండా, అభిమన్యు 89 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 9 సెంచరీలు, టీ20 ఫార్మాట్‌లో ఒక సెంచరీ సాధించాడు. ఈ విధంగా, అతను ఇప్పటివరకు దేశీయ క్రికెట్‌లో మొత్తం 37 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ స్వయంగా అతనికి ఇంగ్లాండ్‌లో (IND vs ENG) అవకాశం ఇవ్వవలసి రావొచ్చు.
కేఎల్-సుదర్శన్ ఓపెనింగ్..
రోహిత్ శర్మ టెస్ట్‌ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌లో భారత (IND vs ENG) ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలడని భావించారు. కానీ అతను ఓపెనింగ్ చేసిన తర్వాత, జట్టు మిడిల్ ఆర్డర్ బలహీనంగా మారవచ్చు. ముఖ్యంగా ఇంగ్లాండ్ లో ఈ ప్రమాదాన్ని చీఫ్ గౌతమ్ గంభీర్ అస్సలు సహించలేడు.
దీంతో పాటు, సాయి సుదర్శన్ కూడా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసే రేసులో చాలా ముందున్నాడు. కానీ, గంభీర్ ప్రస్తుతం అతనికి అవకాశం ఇచ్చే మూడ్‌లో లేకపోవచ్చు. ఎందుకంటే, అభిమన్యు ఈశ్వరన్ చాలా కాలంగా టీమ్ ఇండియా జట్టులో ఉన్నాడు. కాబట్టి అతనికి 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల అనుభవం ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








