AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఎంతకి అమ్ముడుపోయారంటూ! ఇషాన్, అంపైర్ లపై మండిపడుతున్న నెటిజన్లు!

సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వికెట్ వివాదాస్పదంగా మారింది. బౌలర్ అప్పీల్ చేయకుండానే అంపైర్ ఔట్ ఇవ్వడం, కిషన్ DRS తీసుకోకుండానే వెనుదిరగడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ మ్యాచ్‌లో SRH ఘోరంగా విఫలమై మొదటి ఓవర్లలో కీలక వికెట్లను కోల్పోయింది. 

IPL 2025: ఎంతకి అమ్ముడుపోయారంటూ! ఇషాన్, అంపైర్ లపై మండిపడుతున్న నెటిజన్లు!
Mi Vs Srh (3)
Narsimha
|

Updated on: Apr 24, 2025 | 2:00 PM

Share

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన IPL 2025 మ్యాచ్ వివాదాలతో నిండిపోయింది. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్ వికెట్ చుట్టూ ఏర్పడిన పరిస్థితులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ మ్యాచ్‌లో SRH మొదటి ఇన్నింగ్స్‌లోనే ఘోర పరాజయం చవిచూసింది. ఇషాన్ కిషన్, ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో SRH తరపున సెంచరీతో శుభారంభం చేసినా, ఆ తర్వాత ఆయన ఫామ్ పూర్తిగా దిగజారింది. ముంబైతో జరిగిన తాజా మ్యాచ్‌లోనూ కిషన్ కేవలం నాలుగు బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కి వెనుదిరిగాడు.

ఇషాన్ అవుట్ అయిన తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీపక్ చాహర్ వేసిన బంతిని కిషన్ లెగ్ సైడ్ వైపు ఫ్లిక్ చేయాలని ప్రయత్నించాడు. వికెట్ కీపర్ రికెల్టన్ క్యాచ్ పట్టాడు, కానీ బౌలర్ అప్పీల్ చేయలేదు. అయినా కూడా అంపైర్ వేలు పైకెత్తాడు. కిషన్ దీనిని అంగీకరించి ఎటువంటి DRS తీసుకోకుండానే మైదానాన్ని వీడటం పలు సందేహాలకు తావిచ్చింది. టెలివిజన్ రీప్లేల్లో బ్యాట్‌కు బంతి తాకినట్టు ఏమీ కనిపించలేదు. అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్ ఏదీ రాకపోవడం, కిషన్ వెంటనే వాక్ అవుట్ కావడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. చాలా మంది నెటిజన్లు ఈ అంశాన్ని మ్యాచ్ ఫిక్సింగ్‌కు అనుసంధానిస్తూ ఘాటు కామెంట్లు చేశారు.

ఇషాన్ కిషన్‌కి సంబంధించిన ఈ ఘటనపై నెటిజన్ల స్పందన తీవ్రమైంది. “మ్యాచ్ ఫిక్సింగ్ పరాకాష్టకు చేరుకుంది”, “ఇషాన్ కిషన్ బాగా చెల్లించబడిన అంబానీ మేనేజ్మెంట్ ప్లేయర్”, కొన్ని ట్వీట్లు అతనిపై నేరుగా “మోసగాడు”, “కాంట్రాక్ట్ రద్దు చేయాలి” అని కూడా వ్యాఖ్యానించాయి.

ఈ మ్యాచ్‌లో SRH తొలుత బ్యాటింగ్‌కు దిగింది. మొదటి మూడు ఓవర్లలోనే ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వికెట్లను కోల్పోయి ఇన్నింగ్స్‌ను గందరగోళంగా ప్రారంభించింది. ఇది అతని ఇటీవలి ఎనిమిది T20 ఇన్నింగ్స్‌లలో ఏడవసారి అతను సింగిల్ డిజిట్ స్కోరులోనే పెవిలియన్‌కి వెళ్లడం కావడం గమనార్హం. సెంచరీ అనంతరం అతని స్కోర్లు 0, 2, 2, 17, 9, 2 మరియు ఇప్పుడు 1 కావడం ద్వారా అతని ఫామ్ పూర్తిగా కోల్పోయినట్టు స్పష్టమవుతోంది.

ఇషాన్ కిషన్ వివాదం SRH బలహీన స్థితిని మరింత హైలైట్ చేయడం జరిగింది. కేవలం ఆటగాడిగా మాత్రమే కాక, ఒక నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలో తెలియకపోవడం ఆయనపై తీవ్ర ఒత్తిడిని చూపిస్తోంది. సమకాలీన క్రికెట్‌లో ప్రతి రన్, ప్రతి నిర్ణయం కీలకమైన వేళ, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాడి నుండి అలాంటి తీరు అభిమానుల మన్ననలను కోల్పోయేలా చేసింది. IPL లాంటి వేదికపై ప్రతి క్షణం స్పష్టత, న్యాయతత్వం అవసరం. కానీ ఈ మ్యాచ్ మాత్రం అస్పష్టతలు, అనుమానాలతో మిగిలిపోయింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..