MI vs RCB: బెంగళూరు ఓటమికి నితీన్ మీనన్ అంపైరింగే కారణం.. ఇదిగో సాక్ష్యమంటోన్న ఫ్యాన్స్..
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోరంగా ఓడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 196 పరుగులు చేసినప్పటికీ విజయానికి దోహదపడలేదు. ఈలోగా అంపైరింగ్‌పై విమర్శలు వచ్చాయి. నితిన్ మీనన్ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

MI vs RCB: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోరంగా ఓడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 196 పరుగులు చేసినప్పటికీ విజయానికి దోహదపడలేదు. ఈలోగా అంపైరింగ్‌పై విమర్శలు వచ్చాయి. నితిన్ మీనన్ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ శుభారంభం చేయలేదు. విరాట్ కోహ్లి తొందరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత జట్టులో రజత్ పాటిదార్, ఫాప్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈలోగా అంపైరింగ్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది. అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు ముంబైకి అనుకూలంగా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
ఆఖరి ఓవర్‌లో నడుము కంటే ఎత్తులో ఉన్న బంతికి అంపైర్ నో బాల్ ఇవ్వలేదు. ఇది చూసిన విరాట్ కోహ్లీ కూడా అసహనం వ్యక్తం చేశాడు. అలాగే బౌండరీ ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఫీల్డర్ బాడీలో కొంత భాగం బౌండరీకి తగిలింది. ఈ సందర్భంలో, ఫీల్డర్ బౌండరీని టచ్ చేశాడు. అయితే, దీన్ని సరిగ్గా చెక్ చేయలేదు. ఇలాంటివి ఈ మ్యాచ్‌లో చాలానే జరిగాయని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Umpiring in the first innings in a nutshell (ft. Nitin Menon) : – Scammed RCB by not giving a deserving four. – Scammed RCB by not giving deserving wide. – Referred to 3rd umpire when MI hadn’t any reviews left. – Lomror out on umpire’s call when ball was going away from batter. pic.twitter.com/pzueYo5DBf
— BumbleBee (@silly_af_) April 11, 2024
క్లుప్తంగా మొదటి ఇన్నింగ్స్‌లో అంపైరింగ్ (నితిన్ మీనన్) పొరపాట్లు:
– ఫీల్డర్ బౌండరీని తాకినా ఫోర్ ఇవ్వకుండా RCBని మోసం చేశాడు.
– అలాగే, వైడ్ ఇవ్వకుండా RCB మోసం చేశాడు.
– ముంబై వద్ద ఎలాంటి సమీక్షలు లేనప్పుడు థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేశాడు.
– బాల్ బ్యాటర్ నుంచి దూరంగా వెళుతున్నప్పుడు అంపైర్ కాల్ మేరకు లోమ్రోర్ అవుట్ అయ్యాడు.
అలాగే, లోమ్రార్ ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూకి గురయ్యాడు. ఈ బంతి కూడా బయటికి వెళుతోంది. అయితే అంపైర్ అతడిని ఔట్ చేశాడు. తర్వాత, రివ్యూ తీసుకున్నారు. అయితే, అది స్టంప్‌లను కొద్దిగా తాకడంతో అంపైర్ కాల్‌గా ప్రకటించారు.
ఇక ఫాప్ డుప్లెసిస్ కొట్టిన షాట్ బ్యాట్‌కు తగిలి కీపర్ వద్దకు వెళ్లింది. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో ఇషాన్ కిషన్ తదితరులు అంపైర్‌ను అవుట్ ఇవ్వాలని గట్టిగా అభ్యర్థించారు. అప్పటికి ముంబై ఇండియన్స్ రివ్యూలన్నీ అయిపోయాయి. అందువల్ల, అతను సమీక్ష కోరలేదు. ఈ సమయంలో అంపైర్ స్వయంగా థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరాడు. దీన్ని కొందరు ప్రశ్నించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








