సొదరుడి మోసంతో రూ. 4.3 కోట్లు కోల్పోయిన హార్దిక్-కృనాల్‌.. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు..

Vaibhav Pandya Fraud Case: సంచలనం సృష్టించిన కేసులో క్రికెటర్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా సవతి సోదరుడు వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపార భాగస్వామ్యంలో పాండ్యా బ్రదర్స్‌ను వైభవ్ దాదాపు రూ.4.3 కోట్ల మేర మోసం చేశాడు. వార్తా సంస్థ ANI ప్రకారం, 37 ఏళ్ల వైభవ్‌ను ముంబై పోలీసుల ఎకానమీ అఫెన్స్ బ్రాంచ్ అరెస్టు చేసింది.

సొదరుడి మోసంతో రూ. 4.3 కోట్లు కోల్పోయిన హార్దిక్-కృనాల్‌.. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు..
Hardik krunal Vaibhav Pandya
Follow us
Venkata Chari

|

Updated on: Apr 11, 2024 | 11:39 PM

Vaibhav Pandya Fraud Case: సంచలనం సృష్టించిన కేసులో క్రికెటర్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా సవతి సోదరుడు వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపార భాగస్వామ్యంలో పాండ్యా బ్రదర్స్‌ను వైభవ్ దాదాపు రూ.4.3 కోట్ల మేర మోసం చేశాడు. వార్తా సంస్థ ANI ప్రకారం, 37 ఏళ్ల వైభవ్‌ను ముంబై పోలీసుల ఎకానమీ అఫెన్స్ బ్రాంచ్ అరెస్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు అన్నదమ్ములు మూడేళ్ల క్రితం పాలిమర్ వ్యాపారం ప్రారంభించారు. ఇందులో పాండ్యా సోదరులు (కృనాల్, హార్దిక్) 40-40% పెట్టుబడి పెట్టాల్సి ఉండగా, వైభవ్ 20% పెట్టుబడి పెట్టాలని ఒప్పందం చేసుకున్నారు.

కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత కూడా వైభవ్‌దే. లాభాల వాటా పంపిణీని కూడా అదే విధంగా నిర్ణయించారు. అయితే ఈ విషయంపై పాండ్యా సోదరులు బహిరంగంగా స్పందించలేదు.

సమాచారం ఇవ్వకుండా కొత్త సంస్థ ఏర్పాటు..

సమాచారం ఇవ్వకుండా కొత్త సంస్థ ఏర్పాటు చేసిన వైభవ్.. పరువు తీస్తానని బెదిరించాడు. వైభవ్ తన సవతి సోదరులకు తెలియజేయకుండా అదే వ్యాపారంలో మరో సంస్థను ఏర్పాటు చేశాడని ఆరోపించారు. వైభవ్ తన సొంత లాభం వాటాను 20% నుంచి 33.3%కి పెంచుకున్నాడు. దీంతో పాండ్యా బ్రదర్స్‌కు మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ఇవి కూడా చదవండి

ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, వైభవ్ భాగస్వామ్య సంస్థ ఖాతా నుంచి ఒక కోటి కంటే ఎక్కువ మొత్తాన్ని తన స్వంత ఖాతాకు బదిలీ చేశాడు. హార్దిక్‌, కృనాల్‌ సమాధానాలు అడిగితే పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో పాండ్యా సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వడోదరలో క్రికెట్ నేర్చుకున్న హార్దిక్, కృనాల్..

హార్దిక్, కృనాల్ తల్లి పేరు నళిని, తండ్రి పేరు హిమాన్షు పాండ్య. తండ్రి సూరత్‌లో వ్యాపారం చేసేవాడు. కానీ, తన కొడుకులకు క్రికెట్ నేర్పించడానికి కుటుంబంతో కలిసి వడోదరలో స్థిరపడ్డాడు. పాండ్యా సోదరులు వడోదరలోని కిరణ్ మోర్ అకాడమీలో క్రికెట్ ఆడటం నేర్చుకున్నారు. హిమాన్షు పాండ్యా జనవరి 2021లో మరణించాడు.

మీడియా కథనాల ప్రకారం, హార్దిక్, కృనాల్‌లకు మరో ఇద్దరు సోదరులు ఉన్నారు. వైభవ్, గౌరవ్. వారిలో వైభవ్, కృనాల్, హార్దిక్‌లను మోసం చేశాడు. హార్దిక్ జనవరి 2020లో సెర్బియా మోడల్, డ్యాన్సర్ నటాషా స్టాంకోవిక్‌ను వివాహం చేసుకున్నాడు. జులై 2020లో, నటాషా కొడుకు అగస్త్యకు జన్మనిచ్చింది. కృనాల్ కూడా వివాహం చేసుకున్నాడు. అతను 2017లో పంఖురి శర్మను వివాహం చేసుకున్నాడు.

హార్దిక్, కృనాల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా..

ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో ఆడుతున్నారు. కృనాల్ లక్నో సూపర్ జెయింట్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. 2023 ప్రపంచ కప్‌లో చీలమండ గాయం నుంచి కోలుకోవడంతో హార్దిక్‌కి గత కొన్ని నెలలు చాలా కష్టంగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..