BAN vs NZ: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. పాకిస్తాన్ చూపంతా బంగ్లాదేశ్‌పైనే.. ఎందుకో తెలుసా?
Bangladesh vs New Zealand, 6th Match, Group A: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరో మ్యాచ్ ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతోంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఈ మ్యాచ్ కివీస్, బంగ్లాకే కాదు పాకిస్తాన్ జట్లుకు కూడా చాలా ముఖ్యమైనదిగా మారింది. ఎందుకంటే, బంగ్లాదేశ్ గెలిస్తే, పాక్ ఆశలు సజీవంగా ఉంటాయి.

Bangladesh vs New Zealand, Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆరో మ్యాచ్ నేడు న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొదలైంది. ఈ మ్యాచ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఈరోజు న్యూజిలాండ్ గెలిస్తే పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. 2017లో జరిగిన చివరి ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ గ్రూప్ దశలోనే న్యూజిలాండ్‌ను ఓడించింది. బంగ్లాదేశ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఇద్దరూ 1-1 తేడాతో గెలిచారు.
వన్డేల్లో న్యూజిలాండ్‌దే పైచేయి..
మొత్తం మీద వన్డేల్లో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. రెండు జట్లు 45 సార్లు తలపడ్డాయి. ఇందులో కివీస్ జట్టు 33 మ్యాచ్‌లు, బంగ్లాదేశ్ 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
పాకిస్తాన్ ఎలా ఔట్ అవుతుంది?
గ్రూప్ దశలో పాకిస్తాన్‌ను భారత్, న్యూజిలాండ్ ఓడించాయి. ఆ జట్టుకు బంగ్లాదేశ్‌తో ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. మరోవైపు, భారతదేశం 2 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈరోజు న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌ను ఓడిస్తే, ఆ జట్టు భారత్‌తో సమానంగా 4 పాయింట్లు కలిగి ఉంటుంది. ఈ స్థితిలో, భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు నిష్క్రమిస్తాయి. ఎందుకంటే, ఇద్దరూ మ్యాచ్‌లో 2-2 తేడాతో ఓడిపోతారు.
పిచ్ నివేదిక..
రావల్పిండి క్రికెట్ స్టేడియం పిచ్ నివేదిక ప్రకారం, ఈ పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మ్యాచ్ ఫార్మాట్, పరిస్థితులను బట్టి ఈ దృశ్యం మారవచ్చు.
ఇక్కడ ఇప్పటివరకు 26 వన్డేలు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. ముందుగా బౌలింగ్ చేసిన జట్టు 14 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక్కడ అత్యధిక స్కోరు 337/3. ఇది 2023లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ చేసింది.
వాతావరణ నివేదిక..
న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ రోజున రావల్పిండిలో ఎక్కువగా మేఘావృతమై ఉంటుంది. అయితే, వర్షం పడే అవకాశం పూర్తిగా లేదు. ఉష్ణోగ్రత 12 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా. అదే సమయంలో, గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది.
రెండు జట్ల ప్లేయింగ్-11..
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రాచిన్ రవీంద్ర, టామ్ లాథమ్(wk), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూర్క్.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రహ్మాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








