AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విటమిన్ బి6 ఆరోగ్య ప్రయోజనాలు…!

ఫైరిడాక్సిన్ ను B6 విటమిన్ అంటాము. ఇది మూడు రూపాలలో ఉంటుంది. అవి ఫైరిడాక్సిల్, ఫైరిడాక్సిమైన్, ఫైరిడాక్సిన్ లు. అవసరానికి బట్టి ఇవి శరీరంలో రూపాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇది నీటిలో కరిగే విటమిన్. మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ బి6 కూడా ఒకటి.  మన శరీరంలో అనేక పనులకు ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్ల మెటబాలిజంకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి6 ఎంతో […]

విటమిన్ బి6 ఆరోగ్య ప్రయోజనాలు...!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 13, 2019 | 12:01 PM

Share

ఫైరిడాక్సిన్ ను B6 విటమిన్ అంటాము. ఇది మూడు రూపాలలో ఉంటుంది. అవి ఫైరిడాక్సిల్, ఫైరిడాక్సిమైన్, ఫైరిడాక్సిన్ లు. అవసరానికి బట్టి ఇవి శరీరంలో రూపాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇది నీటిలో కరిగే విటమిన్. మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ బి6 కూడా ఒకటి.  మన శరీరంలో అనేక పనులకు ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్ల మెటబాలిజంకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి6 ఎంతో అవసరం ఉంటుంది. అయితే ఈ విటమిన్‌ను మన శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు. కనుక ఆహార పదార్థాల ద్వారానే మనం దీన్ని పొందాల్సి ఉంటుంది.

ఇక విటమిన్ బి6 మనకు తగినంతగా లభించకపోతే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు వస్తాయి. పెదవులు పగులుతాయి. నాలుక, నోటి పూత వస్తుంది. డిప్రెషన్‌తో ఉంటారు. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. నిస్సత్తువగా, అలసిపోయినట్లుగా ఫీలవుతారు. చేతులు, పాదాల్లో గుండు పిన్నులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి ఫిట్స్ కూడా వస్తాయి. అయితే విటమిన్ బి6 ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే పైన చెప్పిన అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

విటమిన్ బి6 మనకు ఎక్కువగా చేపలు, పిస్తాపప్పు, అరటిపండ్లు, అవకాడోలు, చికెన్, మటన్ లివర్, పాలకూర తదితర ఆహారాల్లో లభిస్తుంది. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ బి6 లోపం రాకుండా చూసుకోవచ్చు. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్, కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, జీవక్రియలు సరిగా జరగడానికి విటమిన్ బి6, బి12 ఎంతో అవసరం. ఇవి కళ్లు, జుట్టు, కాలేయం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బి12 లోపిస్తే కంట్లో నరాలు దెబ్బతింటాయి. ఈ రెండు విటమిన్లు మాంసంలో అధికంగా లభిస్తాయి. పచ్చి శనగలు, మొలకలు, బచ్చలి కూర, ఎండు మిరపలోనూ ఈ విటమిన్లు ఉంటాయి.

శరీరంలో కొత్త కణాలు ఏర్పడేందుకు ఫోలిక్ యాసిడ్ సహాయపడుతుంది. ఇది లోపిస్తే అనీమియా రావడంతోపాటు పుట్టబోయే పిల్లల్లో లోపాలు తలెత్తుతాయి. కంటి నరాల్లో క్షీణత కనిపిస్తుంది. తోటకూర, పుదీనా, పాలకూర, పప్పు ధాన్యాలు, నట్స్, కాలేయంలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు