IND vs PAK: మంచు ఖండంలో మహా స్టేడియం.. భారత్, పాక్ పోరుకు సిద్ధమవుతోన్న న్యూయార్క్..

T20 World Cup 2024: ఈ స్టేడియం తూర్పు, పడమర స్టాండ్ల మాడ్యులర్ నిర్మాణం దాని తుది రూపాన్ని తీసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. ఈ స్టాండ్లలో మొత్తం 24 వేల మంది ప్రేక్షకులకు సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో అతిథులు, మీడియా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మాడ్యులర్ స్టేడియం అవుట్‌ఫీల్డ్ మాన్‌హాటన్‌కు తూర్పున 30 మైళ్ల దూరంలో ఉన్న నస్సౌ కౌంటీలోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో ఏర్పాటు చేశారు.

IND vs PAK: మంచు ఖండంలో మహా స్టేడియం.. భారత్, పాక్ పోరుకు సిద్ధమవుతోన్న న్యూయార్క్..
T20 World Cup 2024 ind vs pak
Follow us

|

Updated on: Apr 03, 2024 | 12:17 PM

Nassau County International Cricket Stadium, New York: జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) కొన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పనుల పురోగతికి సంబంధించిన టైమ్‌లాప్స్ వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం షేర్ చేసింది. ఈ మైదానం భారత్ వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య గొప్ప మ్యాచ్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ స్టేడియం తూర్పు, పడమర స్టాండ్ల మాడ్యులర్ నిర్మాణం దాని తుది రూపాన్ని తీసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. ఈ స్టాండ్లలో మొత్తం 24 వేల మంది ప్రేక్షకులకు సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో అతిథులు, మీడియా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మాడ్యులర్ స్టేడియం అవుట్‌ఫీల్డ్ మాన్‌హాటన్‌కు తూర్పున 30 మైళ్ల దూరంలో ఉన్న నస్సౌ కౌంటీలోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ స్టేడియం టైమ్ లాప్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ICC క్యాప్షన్‌లో ‘ నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ అందంగా రూపుదిద్దుకుంటోంది’ అంటూ రాసుకొచ్చింది.

ఈ స్టేడియంలో టోర్నీలో భాగంగా మొత్తం 8 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇక్కడ టీమ్ ఇండియా ఐర్లాండ్, ఆతిథ్య అమెరికాతో కూడా మ్యాచ్‌లు ఆడుతుంది. భారత జట్టు తన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లన్నీ USAలో ఆడనుంది. మేజర్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశం అమెరికాకు రావడం ఇదే తొలిసారి. అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల ఆతిథ్యం USA, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. టోర్నమెంట్ మ్యాచ్‌లు USAలోని మూడు స్టేడియాలు, వెస్టిండీస్‌లోని ఆరు స్టేడియంలలో జరుగుతాయి. జూన్ 1న డల్లాస్‌లో అమెరికా, కెనడా మధ్య జరగనున్న మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా, అన్ని జట్లను నాలుగు గ్రూపులుగా విభజించడం గమనార్హం. ఒక గ్రూపులో ఐదు జట్లను చేర్చారు. గ్రూప్ దశలో మొత్తం 40 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత సూపర్ 8 దశకు చేరుకునే జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ చివరి మ్యాచ్ జూన్ 29 న జరుగుతుంది. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాల ప్రక్రియ కూడా పూర్తయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్