IPL 2024: బంతిని బాదడంలో పీహెచ్‌డీ పట్టాలు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2024లో ఫోర్లు, సిక్సర్లతో దడ పుట్టిస్తోన్న ఐదుగురు..
Top 5 Players Hit Sixes and Fours: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో ఉత్కంఠ మ్యాచ్‌లతో పాటు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తోంది. ఈ బౌండరీల వర్షంలో అభిమానులు తడిసి ముద్దవుతున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా శిఖర్ ధావన్ ఉండగా, అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు బాదిన ఐదుగురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం..
Top 5 Players Hit Maximum Fours and Sixes in IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో ఉత్కంఠ మ్యాచ్‌లతో పాటు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తోంది. ఈ బౌండరీల వర్షంలో అభిమానులు తడిసి ముద్దవుతున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా శిఖర్ ధావన్ ఉండగా, అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఇది కాకుండా, గత సీజన్ గురించి మాట్లాడుకుంటే, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభమాన్ గిల్ అత్యధిక ఫోర్లు కొట్టగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఫాఫ్ డు ప్లెసిస్ అత్యధిక సిక్సర్లు కొట్టారు.
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు బాదిన ఐదుగురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం..
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు..
1- విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): (మ్యాచ్‌లు – 4, పరుగులు – 203, ఫోర్లు – 17, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు – 11)
2- శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్): (మ్యాచ్‌లు – 3, పరుగులు – 137, ఫోర్లు – 16, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు – 7)
3- క్వింటన్ డి కాక్ (లక్నో సూపర్ జెయింట్స్) : (మ్యాచ్ – 3, రన్ – 139, ఫోర్లు – 14, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు – 8)
4- రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్): (మ్యాచ్‌లు – 3, పరుగులు – 181, ఫోర్లు – 13, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు – 97
5- డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్): (మ్యాచ్‌లు – 3, పరుగులు – 130, ఫోర్లు – 13, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు – 5)
ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు..
1- హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): (మ్యాచ్‌లు – 3, పరుగులు – 167, సిక్స్‌లు – 17, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు – 8)
2- నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్): (మ్యాచ్‌లు – 3, పరుగులు – 146, సిక్స్‌లు – 12, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు – 5)
3- రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్): (మ్యాచ్‌లు – 3, పరుగులు – 181, సిక్స్‌లు – 12, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు – 6)
4- అభిషేక్ శర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్): (మ్యాచ్‌లు – 3, పరుగులు – 124, సిక్స్‌లు – 11, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు – 7)
5- తిలక్ వర్మ (ముంబయి ఇండియన్స్): (మ్యాచ్‌లు – 3, పరుగులు – 121, సిక్స్‌లు – 9, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు – 6)
IPL 2024 పాయింట్ల పట్టిక..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..