AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Record Score in ODI : వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు..! 491 పరుగులు చేసిన న్యూజిలాండ్.. 347 పరుగుల తేడాతో ఘన విజయం..

Record Score in ODI : వన్డే క్రికెట్‌లో 2006 సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాపై 434 పరుగులు చేసినప్పుడు

Record Score  in ODI : వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు..! 491 పరుగులు చేసిన న్యూజిలాండ్.. 347 పరుగుల తేడాతో ఘన విజయం..
New
uppula Raju
|

Updated on: Jun 08, 2021 | 6:32 PM

Share

Record Score in ODI : వన్డే క్రికెట్‌లో 2006 సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాపై 434 పరుగులు చేసినప్పుడు ఒక రికార్డ్ నమోదైంది. అప్పట్లో వన్డే క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు. అయితే అదే మ్యాచ్‌లో ఈ రికార్డు బద్దలైంది. అవును దక్షిణాఫ్రికా ఈ చారిత్రాత్మక ఎవరెస్ట్ తరహా స్కోరును ఒక బంతి మిగిలి ఉండగానే ముగించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 438 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ తర్వాత వన్డే క్రికెట్‌లో ఈ స్కోరు వెలిగింది. కానీ దీని తరువాత ఈ రోజు అంటే జూన్ 8, 2018 న న్యూజిలాండ్ జట్టు ఎవరూ చేయకూడదని స్కోరు సాధించింది. న్యూజిలాండ్ 491 పరుగులు చేసి వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరు సాధించింది. అది కూడా కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

వాస్తవానికి ఈ మ్యాచ్ డబ్లిన్‌లో న్యూజిలాండ్, ఐర్లాండ్ మహిళా జట్ల మధ్య జరిగింది (న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్ ఉమెన్). మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 4 వికెట్లకు 491 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ ఓపెనర్ సుజీ బేట్స్ 94 బంతుల్లో 151 పరుగులు చేసింది. 24 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టింది. ఆమెతో పాటు మాడి గ్రీన్ 77 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్‌తో 122 పరుగులు చేసింది. ఎమిలియా కెర్ 45 బంతుల్లో అజేయంగా 81 పరుగులు చేసింది. ఆమె 9 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టింది. ఇది కాకుండా జెస్ వాట్కిన్ కూడా అర్ధ సెంచరీ సాధించింది. 59 బంతుల్లో 10 ఫోర్లతో 62 పరుగులు ఆమె బ్యాట్ నుంచి వచ్చాయి. ఇంకా న్యూజిలాండ్‌కు 31 అదనపు పరుగులు వచ్చాయి.

347 పరుగుల తేడాతో గెలిచింది.. ఇంత స్కోరు సాధించాక ఈ మ్యాచ్‌ ఫలితంపై ఎవరూ ఆసక్తి చూపరు. అయినప్పటికీ ఐర్లాండ్ జట్టు అస్సలు పోరాడలేకపోయింది.144 పరుగులకే దుకాణం సర్దేసింది. కేవలం 35.3 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. కెప్టెన్ లారా డెలానీ అత్యధికంగా 37 పరుగులు చేసింది. అదే సమయంలో జెన్నిఫర్ గ్రే 35 పరుగులు చేసి జట్టు పరువును కాపాడటానికి ప్రయత్నించింది. అత్యధిక వికెట్లు తీసిన ఘనత లే కాస్పెరెక్‌కు దక్కింది. ఇది కాకుండా హన్నా రోవ్ ఇద్దరు బ్యాట్స్ మెన్లను పెవిలియన్కు పంపించడం ద్వారా జట్టు విజయాన్ని నిర్ధారించింది. ఈ విధంగా న్యూజిలాండ్ 347 పరుగుల భారీ ముగింపుతో చారిత్రాత్మక మ్యాచ్ గెలిచింది.

TV9 Appreciates Nurses Care: మానవత్వం పరిమళించిన వేళ..! కరోనా పేషెంట్‌కు భోజనం తినిపించిన నర్సులు..

TS Cabinet Meeting Live: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్.. లాక్‌డౌన్‌ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్

PF Link Aadhar: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ కార్డు లింక్ చేయ‌లేదా.? వెంట‌నే ఇలా చేయండి.. లేదంటే చాలా న‌ష్ట పోతారు..