Video: ప్రపంచ కప్ 2023కి నెదర్లాండ్స్ అర్హత.. కట్‌చేస్తే.. గుండు కొట్టించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆటగాడు..
Teja Nidamanuru: వన్డే ప్రపంచకప్ 2023 లో నెదర్లాండ్స్ జట్టు ఇప్పుడు భారత్‌లో ఆడనుంది. ICC ODI ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్‌లో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను ఓడించడం ద్వారా ఈ ICC టోర్నమెంట్‌కు అర్హత సాధించిన పదవ జట్టుగా నిలిచింది.
Teja Nidamanuru, World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 లో నెదర్లాండ్స్ జట్టు ఇప్పుడు భారత్‌లో ఆడనుంది. ICC ODI ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్‌లో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను ఓడించడం ద్వారా ఈ ICC టోర్నమెంట్‌కు అర్హత సాధించిన పదవ జట్టుగా నిలిచింది. గురువారం జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నాలుగు వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ తేజ నిడమనూరు వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన వెంటనే గుండు కొట్టించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌నకు తమ జట్టు అర్హత సాధిస్తే గుండు కొట్టించుకుంటానని తేజ నిడమనూరు గతంలో వాగ్దానం చేశాడు. దీంతో తాజాగా తన హామీని నెరవేర్చాడు.
జూన్ 16న ప్రతిజ్ఞ.. జులై 6న గుండు..
నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ తేజ 16 జూన్ 2023న తన జట్టు 2023 ODI ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తే గుండు కొట్టుకుంటానని ప్రమాణం చేశాడు. అయితే, అతని జట్టు జులై 6న స్కాట్లాండ్‌ను ఓడించి టాప్-10లో చోటు సంపాదించిన వెంటనే అతను గుండు చేయించుకున్నాడు. అయితే స్కాట్లాండ్‌పై తేజ బ్యాట్ పనిచేయలేదు.
5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన తేజ 11 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 10 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో, అతని జట్టు ఆల్ రౌండర్ బాస్ జి లీడే 123 పరుగుల ఇన్నింగ్స్ ఆడి 5 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే నెదర్లాండ్స్ ఈ విజయాన్ని సాధించింది.
తేజ పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోనే..
తేజ పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోనే కావడం విశేషం. అతను ఇప్పుడు నెదర్లాండ్స్ తరపున క్రికెట్ ఆడుతున్నాడు . అతను న్యూజిలాండ్‌లోని దీవుల తరపున దేశవాళీ క్రికెట్ కూడా ఆడాడు. 2021 సంవత్సరం వరకు, అతను వర్క్‌ఫ్లో కంపెనీలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా ఉన్నారు. అతను నెదర్లాండ్స్ ఇంటర్నేషనల్ స్టెఫాన్ మైబెర్గ్‌తో కూడా పని చేస్తున్నాడు.
Teja Nidamanuru is a man of his word. 🫡💇#ICCWorldCupQualifier #CWC23 pic.twitter.com/6kUzpom6FF
— Cricket🏏Netherlands (@KNCBcricket) July 7, 2023
తేజ కెరీర్..
31 మే 2022న వెస్టిండీస్‌పై ODIలలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను T20 అంతర్జాతీయ క్రికెట్‌లో 11 జులై 2022న పాపువా న్యూ గినియాపై అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 11 వన్డేల్లో ఒక సెంచరీతో 269 పరుగులు చేయగా, 6 టీ20 మ్యాచుల్లో 110 పరుగులు మాత్రమే చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..