T20 World Cup 2024: రోహిత్, స్కై కాదు.. టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టేది అతనే: యువరాజ్ సింగ్

టీ20 ప్రపంచకప్‌కు ఇంకా 36 రోజుల సమయం ఉంది. ఈ మేజర్ క్రికెట్ టోర్న కోసం తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. యువరాజ్ సింగ్‌తో పాటు క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్‌లకు కూడా ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఐసీసీ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో యువరాజ్ సింగ్ అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు

T20 World Cup 2024: రోహిత్, స్కై కాదు.. టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టేది అతనే: యువరాజ్ సింగ్
Yuvraj Singh
Follow us

|

Updated on: Apr 28, 2024 | 7:51 PM

టీ20 ప్రపంచకప్‌కు ఇంకా 36 రోజుల సమయం ఉంది. ఈ మేజర్ క్రికెట్ టోర్న కోసం తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. యువరాజ్ సింగ్‌తో పాటు క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్‌లకు కూడా ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఐసీసీ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో యువరాజ్ సింగ్ అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ముఖ్యంగా ఐపీఎల్ లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్ కొట్టాడు యువరాజ్ సింగ్. అదే తొలి టీ20 ప్రపంచకప్‌. ఇంగ్లండ్‌ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ ఈ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో ‘ఈసారి వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగల సత్తా ఎవరికి ఉంది?’’ అని యువరాజ్‌ సింగ్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. ‘నేనైతే హార్దిక్‌ పాండ్యానే సాధిస్తాడనుకుంటున్నా’ అని యువీ ఆన్సర్ ఇచ్చాడు.

కాగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో హార్దిక్‌ పాండ్యాపై యువరాజ్ సింగ్ అంత నమ్మకం వ్యక్తం చేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఫ్లాప్ అయ్యాడు. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ జట్టు 9వ స్థానంలో ఉంది. 8 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

అదే సమయంలో టీ 20 ప్రపంచకప్‌ జట్టులో శివం దూబేకు కూడా స్థానం ఇవ్వాలని యువీ అభిప్రాయపడ్డాడు. ‘భారత జట్టులో దూబేకు సుస్థిర స్థానం ఉండటం లేదు. కానీ ఐపీఎల్‌లో మాత్రం బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. అతనిని జట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది’ అని యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్ లీగ్ రౌండ్‌లో భారత జట్టు మ్యాచ్‌లు

  • ఇండియా vs ఐర్లాండ్, జూన్ 5, న్యూయార్క్
  • ఇండియా vs పాకిస్తాన్, జూన్ 9, న్యూయార్క్
  • ఇండియా vs USA, జూన్ 12, న్యూయార్క్
  • ఇండియా vs కెనడా, జూన్ 15, ఫ్లోరిడా

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్/శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్, కుల్‌దీప్, బుమ్రా మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఎన్‌బీఎఫ్‌సీలకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఇక రుణం రూ. 20వేలలోపే..
ఎన్‌బీఎఫ్‌సీలకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఇక రుణం రూ. 20వేలలోపే..
కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!
కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!
అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి..
అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి..
ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం.. వాడిపడేసిన ప్లాస్టిక్ పెట్టుబడి..
ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం.. వాడిపడేసిన ప్లాస్టిక్ పెట్టుబడి..
గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్.. వీడియో
గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్.. వీడియో
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
అధిక వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కావాలా?
అధిక వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కావాలా?
ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా? అయితే మీకు క్యాన్సర్ వచ్చినట్టే!
ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా? అయితే మీకు క్యాన్సర్ వచ్చినట్టే!
ఆ రాశుల వారికి త్వరలో కష్టనష్టాల నుంచి విముక్తి..
ఆ రాశుల వారికి త్వరలో కష్టనష్టాల నుంచి విముక్తి..
వేసవిలో చందనం చేసే మ్యాజిక్స్ ఇవే.. డోంట్ మిస్!
వేసవిలో చందనం చేసే మ్యాజిక్స్ ఇవే.. డోంట్ మిస్!