టెస్ట్ క్రికెట్‌ సంచలనం.. 28 ఫోర్లు, 11 సిక్సర్లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. ఆ ప్లేయర్ ఎవరంటే.!

Cricket News: సాధారణంగా టెస్ట్ క్రికెట్‌లో ఆటగాళ్లు జట్టుకు విజయాన్ని అందించే క్రమంలో కీలక భాగస్వామ్యాలు, పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడుతుంటారు...

టెస్ట్ క్రికెట్‌ సంచలనం.. 28 ఫోర్లు, 11 సిక్సర్లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. ఆ ప్లేయర్ ఎవరంటే.!
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2021 | 11:22 AM

సాధారణంగా టెస్ట్ క్రికెట్‌లో ఆటగాళ్లు జట్టుకు విజయాన్ని అందించే క్రమంలో కీలక భాగస్వామ్యాలు, పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడుతుంటారు. అందుకోసం చాలా ఓపిక ఉండాలి. అయితే క్రిస్ గేల్, సెహ్వాగ్, డివిలియర్స్, రోహిత్ శర్మ.. లాంటి విధ్వసకర బ్యాట్స్‌మెన్లు మొదటి బంతి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుపడతారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చెప్పబోయే బ్యాట్స్‌మెన్‌ కూడా ఇదే కోవకు చెందిన ప్లేయర్. టెస్ట్ క్రికెట్‌లో అద్భుత రికార్డులు ఈ ఆటగాడి సొంతం. అత్యంత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును నమోదు చేసిన ఈ ఆటగాడు సరిగ్గా వరల్డ్ కప్ ముందు తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. అతడెవరో కాదు న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ నాథన్ ఆస్టెల్. 1971 సెప్టెంబర్ 15న జన్మించిన ఆస్టెల్.. కివీస్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తన 12 సంవత్సరాల సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్‌కు ప్రపంచకప్ ముందు రిటైర్మెంట్ పలికాడు.

1995లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో నాథన్ ఆస్టెల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత టెస్టుల్లో కూడా ఆడాడు. అంతేకాకుండా 2005వ సంవత్సరంలో టీ20 క్రికెట్ అభివృద్ధి చెందుతున్నప్పుడు.. ఆ ఫార్మాట్‌లోనూ తన లక్ పరీక్షించుకున్నాడు. 81 టెస్టులు ఆడిన ఆస్టెల్ 37.02 సగటుతో 4702 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 11 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక స్కోరు 222 పరుగులు. ఇక ఆస్టెల్ వన్డే రికార్డులు పరిశీలిస్తే.. 223 వన్డేల్లో 34.92 సగటుతో 7090 పరుగులు చేశాడు. 16 సెంచరీలు, 41 అర్ధ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక స్కోర్ 145 నాటౌట్. నాథన్ ఆస్టెల్ తన స్థిరమైన ఆటతీరుతో కివీస్ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. అప్పుడే 2002లో ఇంగ్లాండ్‌తో ఆడిన టెస్ట్ సిరీస్ నాథన్ ఆస్టెల్ కెరీర్‌కు ఓ మైలురాయిగా నిలిచింది.

బోథమ్ 20 ఏళ్ల రికార్డు బద్దలు…

క్రైస్ట్‌చర్చ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఆస్టెల్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. తద్వారా బోథమ్ పేరు మీదున్న 20 ఏళ్ళ రికార్డును ఆస్టెల్ బద్దలు కొట్టాడు. ఆస్టెల్ 168 బంతుల్లో 222 పరుగులు చేయగా.. 153 బంతుల్లోనే డబుల్ సెంచరీ నమోదైంది. ఇప్పటిదాకా ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 550 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్‌ను ఆస్టెల్ డబుల్ సెంచరీ సహాయంతో విజయానికి చేరువ చేయగా.. చివర్లో ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ జట్టు 451 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read Also: బ్యాంకు ఎకౌంట్లోకి లక్షలు.. మోడీ పంపించారట.. తిరిగి ఇవ్వనంటూ మడత పేచీ! ఈ స్టోరీ వింటే నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు..

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ