రెండేళ్లలో ఈ ఆటగాడు 10 పరుగులు చేయలేదు..! కానీ ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నాడు..
Cricket News: దాదాపు 18 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఇక్కడ వన్డే, టి 20 సిరీస్ ఆడవలసి ఉంది. కానీ న్యూజిలాండ్ ఆటగాడు
Cricket News: దాదాపు 18 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఇక్కడ వన్డే, టి 20 సిరీస్ ఆడవలసి ఉంది. కానీ న్యూజిలాండ్ ఆటగాడు ఒకరు నిలకడ లేని ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు. దీంతో అతని కెరీర్ ముగింపుకు దశకు వచ్చినట్లు కనిపిస్తోంది. దీనికి పెద్ద కారణం ఇటీవల బంగ్లాదేశ్ పర్యటన. ఈ పర్యటనలో ఈ ఆటగాడు ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌లలో కేవలం 10 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఇతడు ఎవరో కాదు కోలిన్ డి గ్రాండ్‌హోమ్.
బంగ్లాదేశ్ పర్యటనలో అతను 5 టీ ట్వంటీ మ్యాచ్‌లలో కేవలం 18 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కూడా ఏమాత్రం రాణించలేదు. కేవలం 3.4 ఓవర్లు మాత్రమే బౌల్ చేశాడు ఒక్క వికెట్ సాధించాడు. బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. డి గ్రాండ్‌హోమ్ దాదాపు రెండు సంవత్సరాలుగా టి 20 లో పరుగులేమి చేయడం లేదు. నవంబర్ 2019లో ఇంగ్లాండ్‌పై చివరిగా 55 పరుగులు చేశాడు. అప్పటి నుంచి అతని అత్యధిక స్కోరు తొమ్మిది పరుగులు మాత్రమే. అతను 10 టీ 20 మ్యాచ్‌లలో కేవలం39 పరుగులు చేశాడు.
ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో స్పిన్నర్ నసూమ్ అహ్మద్ బంతులను డి గ్రాండ్‌హోమ్ అర్థం చేసుకోలేకపోయాడు. అహ్మద్ అతన్ని ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు అవుట్ చేశాడు. ఒక మ్యాచ్‌లో అయితే తొమ్మిది బంతులను ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేశాడు. చాలా మంది న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లు ఈ పర్యటనలో లేరు కాబట్టి అతడిపై చాలా పెద్ద బాధ్యత ఉంది. కానీ అతను ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఈ పర్యటనలో అతని బౌలింగ్, ఫీల్డింగ్ కూడా చాలా చెత్తగా ఉన్నాయి. దీంతో అతడి కెరీర్ ముగింపు దశకు వచ్చినట్లే అని అందరు భావిస్తున్నారు.