AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident Video: ఈ బైక్‌ రైడర్‌కి ఇంకా నూకలున్నాయి..! వేగంగా వెళ్లే బస్సుకింద పడిపోయినా బతికిపోయాడు..

Accident Video: యాక్సిడెంట్‌కి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోలను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కొన్ని వీడియోలు చాలా

Accident Video: ఈ బైక్‌ రైడర్‌కి ఇంకా నూకలున్నాయి..! వేగంగా వెళ్లే బస్సుకింద పడిపోయినా బతికిపోయాడు..
Accident Video
uppula Raju
|

Updated on: Sep 15, 2021 | 4:31 PM

Share

Accident Video: యాక్సిడెంట్‌కి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోలను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కొన్ని వీడియోలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. కొన్నిసార్లు అద్భుత వీడియోలు కూడా ఉంటాయి. ఈ వీడియోలను నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తారు. ప్రమాదం ఎలా జరిగిందని పదే పదే చూస్తారు. కామెంట్లు, షేర్లు చేస్తారు. తాజాగా ఓ యాక్సిడెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం.

ఈ యాక్సిడెంట్‌ గుజరాత్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ఒక బైక్ రైడర్ త్రుటిలో ప్రాణాలతో తప్పించుకుంటాడు. వీడియోలో ఓ బస్సు హైవేలో స్పీడ్‌గా వెళ్లడం మనం గమనించవచ్చు. కానీ అకస్మాత్తుగా బైక్ నడుపుతున్న యువకుడు మూల మలుపు వద్ద బస్సును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అతను బస్సును ఢీకొని ముందు చక్రాల మధ్యలో పడిపోతాడు. కొన్ని సెకన్ల పాటు ఏం జరిగిందో ఎవ్వరకి అర్థం కాదు. బస్సు యువకుడి పై నుంచి వెళ్లిందని అందరు అనుకుంటారు.

కానీ కొద్దిసేపటికి బస్సు ఆగిపోవడంతో యువకుడు బస్సు కింది నుంచి మెల్లగా బయటికి వస్తాడు. దీంతో అందరు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంటారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో ఇప్పటికీ ఎవ్వరికి అర్థం కాదు. వెంటనే హైవే గుండా వెళుతున్న ప్రయాణికులు కిందపడిన ఆ యువకుడి బైక్‌ని ఎత్తి రోడ్డు పక్కకు తీసుకెళ్లడం మనం వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను చూసిన తరువాత ప్రజలు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఆ యువకుడికి భూమిపై ఇంకా నూకలున్నాయని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. దీనినే అదృష్టం అని మరొక వినియోగదారు అన్నాడు. రోడ్డు ప్రమాదాలు ఎల్లప్పుడూ ప్రాణాంతకం అని మరొక వినియోగదారు చెప్పాడు. కానీ ప్రతి ఒక్కరూ ఎప్పుడు అదృష్టవంతులు కాదు అందుకే ఎల్లప్పుడూ రోడ్డుపై జాగ్రత్తగా ప్రయాణించడం ముఖ్యం.

Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. టెలికాం, ఆటోమొబైల్‌ రంగాలకు ఊరట! పీఎల్‌ఐకి ఒకే చెప్పిన మోడీ సర్కార్

సైదాబాద్ రాక్షకుడిని పట్టుకునేందుకు మరిన్ని క్లూస్.. గుండు చేయించుకుంటే ఇలా ఉంటాడు..

Bigg Boss 5 Telugu: ఆ ఒక్క మాటే కొంపముంచిందా ?.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..