AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6,33,0,15,36,5.. సిగ్గుండాలి.. ఇకనైనా ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోకుంటే ఇజ్జత్ పోతది..!

SKY Batting Statistics: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడమే కాకుండా, జట్టు ఓటములకు ప్రధాన కారణంగా మారుతున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌లలో ఆయన ప్రదర్శన చూస్తుంటే సూర్య కెరీర్ ప్రమాదంలో పడినట్లే కనిపిస్తోంది.

6,33,0,15,36,5.. సిగ్గుండాలి.. ఇకనైనా ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోకుంటే ఇజ్జత్ పోతది..!
Suryakumar Yadav
Venkata Chari
|

Updated on: Apr 30, 2026 | 5:31 PM

Share

Suryakumar Yadav Form: ఒకప్పుడు మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించి ‘మిస్టర్ 360’గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్, ఇప్పుడు క్రీజులో నిలదొక్కుకోవడం గగనంగా మారింది. గత ఏడాదిన్నర కాలంగా ఆయన ఆటతీరులో పదును తగ్గింది. ముఖ్యంగా 2026 ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్‌కు పీడకలగా మారుతోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం 162 పరుగులు మాత్రమే చేయడం ఆయన వైఫల్యానికి నిదర్శనం. సగటు కేవలం 20.25 మాత్రమే ఉండటం గమనార్హం. గత ఆరు మ్యాచ్‌ల స్కోర్లు పరిశీలిస్తే.. 6, 33, 0, 15, 36, 5 పరుగులు మాత్రమే ఉన్నాయి. కీలక సమయాల్లో వికెట్ పారేసుకోవడం జట్టును కోలుకోలేని దెబ్బ తీస్తోంది.

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చేతులెత్తేసిన వైనం..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిరాశపరిచాడు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై, బౌండరీల వర్షం కురుస్తున్న వేళ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కీలకమైన మధ్య ఓవర్లలో కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడంలో కూడా ఇబ్బంది పడ్డాడు. సూర్య దూకుడుగా ఆడి ఉంటే ముంబై మరో 20 పరుగులు అదనంగా సాధించేది. దీనివల్ల 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో జట్టు విఫలమై, ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది.

ఇది కూడా చదవండి: హ్యాట్రిక్‌‌పై కన్నేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌ చూస్తే ప్రత్యర్థులు డకౌట్.. కెప్టెన్‌గా ఎవరంటే?

ఇవి కూడా చదవండి

తిలక్ వర్మపై ప్రభావం..

సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్ స్థానంలో రావడం వల్ల, ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మను లోయర్ ఆర్డర్‌లో పంపాల్సి వస్తోంది. ఇది జట్టు బ్యాటింగ్ సమతుల్యతను దెబ్బతీస్తోంది. వరుసగా విఫలమవుతున్నా సూర్యకే ప్రాధాన్యత ఇవ్వడంపై క్రికెట్ విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు. సూర్య ఫామ్‌లోకి రాకపోతే ముంబైకి ఈ టోర్నీలో ముందడుగు వేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.

అభిమానుల ఆగ్రహం – కెరీర్ ముగిసినట్లేనా?

సోషల్ మీడియా వేదికగా ముంబై అభిమానులు సూర్యపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. “ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం” అంటూ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. గత పేరుతోనే జట్టులో కొనసాగడం సరికాదని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 దక్షిణాఫ్రికా సిరీస్ నుండి మొదలైన ఈ పేలవ ఫామ్ ఇలాగే కొనసాగితే, టీమిండియాలో కూడా ఆయన స్థానం గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి: మన పూర్వీకుల టిఫీన్ ఇదే.. ఒక్కటి తింటే చాలు.. తస్సాదియ్యా కొండలనైనా పిండి చేస్తారంతే..!

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us