Ranji Trophy 2022: ముచ్చటగా మూడోది.. వరుస సెంచరీలతో దుమ్మురేపిన ముంబై ప్లేయర్.. ఎవరంటే?

ముంబై తరుపున రెండో ఇన్నింగ్స్‌లో అర్మాన్ జాఫర్ కూడా అద్భుత సెంచరీ సాధించాడు. జాఫర్, యశస్వి రెండో వికెట్‌కు 286 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం కారణంగా..

Ranji Trophy 2022: ముచ్చటగా మూడోది.. వరుస సెంచరీలతో దుమ్మురేపిన ముంబై ప్లేయర్.. ఎవరంటే?
Yashasvi Jaiswal
Follow us

|

Updated on: Jun 17, 2022 | 3:35 PM

రంజీ ట్రోఫీలో యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. బెంగళూరులో ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ముంబై తరపున 20 ఏళ్ల యశస్వి రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీతో సత్తా చాటాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 100 పరుగుల అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ యశస్వి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (103 పరుగులు) చేశాడు. అంటే యశస్వి వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించాడు.

అర్మాన్ జాఫర్ కూడా..

ముంబై తరుపున రెండో ఇన్నింగ్స్‌లో అర్మాన్ జాఫర్ కూడా అద్భుత సెంచరీ సాధించాడు. జాఫర్, యశస్వి రెండో వికెట్‌కు 286 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం కారణంగా, సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ముంబై జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం ముంబై ఆధిక్యం 500 పరుగులకు పైగా పెరిగింది. జాఫర్ 127 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

ఇవి కూడా చదవండి

యూపీ 180కి పరిమితం..

ముంబై తన తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులు చేసింది. జట్టుకు హార్దిక్ తమోర్ 115, యశస్వి జైస్వాల్ 100 పరుగులు అందించారు. ఉత్తరప్రదేశ్ తరపున కరణ్ శర్మ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. దీంతో ఉత్తరప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ కేవలం 180 పరుగులకే కుప్పకూలింది. శివమ్ మావి 48, మాధవ్ కౌశిక్ 38 పరుగులు చేశారు. ముంబై నుంచి తనుష్ కొటియన్, మోహిత్ అవస్థి, తుషార్ దేశ్‌పాండే తలా మూడు వికెట్లు పడగొట్టారు.

ఐపీఎల్ 2022లోనూ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్‌లో కూడా యశస్వి పాల్గొన్నాడు. అయినప్పటికీ, అతని ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీచేయలేకపోయాడు. అతను రాజస్థాన్ రాయల్స్ (RR) కోసం 10 మ్యాచ్‌లలో 258 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కొన్ని మ్యాచ్‌లలో యశస్విని ప్లేయింగ్ XI నుంచి కూడా తొలగించారు. ఆ తరువాత అతను మంచి ఇన్నింగ్స్ ఆడగలిగాడు.

Latest Articles
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయా? అసలు కారణం ఏంటి?
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయా? అసలు కారణం ఏంటి?
ఎన్నికల వేళ నగరిలో రగులుతూన్న అసమ్మతి సెగ..!
ఎన్నికల వేళ నగరిలో రగులుతూన్న అసమ్మతి సెగ..!
మరోసారి ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ..
మరోసారి ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ..
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!