దేశమంతా జెండా పండుగ సంబురం.. ఒక్క పోస్ట్‌తో కన్నీళ్లు పెట్టించిన ధోనీ.. ఇంతకీ ఏంజరిగిదంటే?

MS Dhoni On This day: విశాఖపట్నంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ధోనీ కెరీర్ మెరిసింది. ఆ తర్వాత జైపూర్‌లో శ్రీలంకపై 183 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ధోనీని కెరీర్ దూసుకపోయింది. టీమిండియా కెప్టెన్ అయిన తర్వాత, ధోని తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుని లోయర్ ఆర్డర్‌లో ఆడటం ప్రారంభించాడు.

దేశమంతా జెండా పండుగ సంబురం.. ఒక్క పోస్ట్‌తో కన్నీళ్లు పెట్టించిన ధోనీ.. ఇంతకీ ఏంజరిగిదంటే?
Ms Dhoni
Follow us
Venkata Chari

|

Updated on: Aug 15, 2023 | 8:46 AM

MS Dhoni Retirement: ఆగస్టు 15. దేశ స్వాతంత్ర్య దినోత్సవం. దేశమంతా సంబరాల్లో మునిగితేలుతున్న రోజు. దేశమంతటా భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. 2020లో కూడా ఇదే పరిస్థితి.. కోవిడ్‌ విజృంభించినా దేశంలో ఆ రోజు ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. కానీ, సాయంత్రం 7:29 నిమిషాలకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ రావడంతో దేశం మొత్తం షాక్‌కు గురైంది. సంతోషం దుఃఖంగా మారింది. చాలా మందికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏమి జరిగిందో ఎవరికీ తెలియలేదు. ఈ పోస్ట్ భారతదేశపు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనిది కావగం గమనార్హం. ఈ పోస్ట్‌తో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

వెంటనే ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ పెట్టాడు. అదేవిధంగా దేశంలో వాతావరణం అశాంతికి లోనైంది. ఆ సమయంలో ధోనీ తన ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో కలిసి ఐపీఎల్ కోసం యూఏఈకి బయలుదేరాడు. అంతకుముందు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

ధోనీ రిటైర్మెంట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by M S Dhoni (@mahi7781)

ధోనీ ఎవరూ ఊహించని పని చేశాడు. ధోనీ వన్డే, టీ20 టీమ్‌కి కెప్టెన్సీని వదులుకుని హఠాత్తుగా విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చాడు. అలానే ధోనీ రిటైర్మెంట్ సమయంలోనూ.. ఎవరూ ఊహించని సమయంలో నిశ్శబ్దంగా ఓ పోస్ట్ పెట్టి వీడ్కోలు పలికాడు. ఈ ప్రయాణంలో మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ధోనీ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. నేను 19:29 నుంచి రిటైర్ అయినట్లు భావించండి. ఈ పోస్ట్‌తో పాటు టీమ్ ఇండియాతో తన ప్రయాణానికి సంబంధించిన చిత్రాలతో పాటు ధోనీ ఒక వీడియోను కూడా పంచుకున్నాడు.

క్రికెట్ ఫ్యాన్స్‌ సంతోషంలో ఉండేందుకు ఎన్నో అవకాశాలు అందించిన ఆటగాడు ధోనీ. అతను తన కెప్టెన్సీతో అనేక మ్యాచ్‌లు, ట్రోఫీలను గెలుచుకున్నాడు. తన ప్రవర్తనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. నేటికీ ధోనీ ప్రజల హృదయాలను శాసిస్తున్నాడు. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ధోనీ. అతని కెప్టెన్సీలో భారత్ 2007లో టీ20, 2011లో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అదే సమయంలో 2013లో ధోనీ సారథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అప్పటి నుంచి భారత్ ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది.

ధోనీ పోస్ట్..

View this post on Instagram

A post shared by M S Dhoni (@mahi7781)

జూనియర్లతో ఎలా వ్యవహరించాలో, సీనియర్లను ఎలా గౌరవించాలో ధోనికి తెలుసు. సౌరవ్ గంగూలీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నప్పుడు, ఆ టెస్ట్ మ్యాచ్ చివరి రోజున ధోనీ గంగూలీని కెప్టెన్‌గా అనుమతించాడు. సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు, ధోనీ అతని కోసం ఒక శాండ్‌ఆఫ్ ప్లాన్ చేశాడు.

ఇప్పటికీ తగ్గని హవా..

View this post on Instagram

A post shared by M S Dhoni (@mahi7781)

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ధోని IPL మాత్రమే ఆడుతున్నాడు. రిటైర్ అయిన తర్వాత చెన్నై అతని కెప్టెన్సీలో రెండుసార్లు IPL గెలిచింది. ఈ ఏడాది కూడా ధోనీ కెప్టెన్సీలోనే చెన్నైకి ఐపీఎల్‌ను అందించాడు. ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా తగ్గలేదు. ఎక్కడికెళ్లినా అభిమానులు అతడిపై అభిమానం చూపిస్తుంటారు.

ఉత్తమ ఫినిషర్ చిత్రం..

View this post on Instagram

A post shared by M S Dhoni (@mahi7781)

విశాఖపట్నంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ధోనీ కెరీర్ మెరిసింది. ఆ తర్వాత జైపూర్‌లో శ్రీలంకపై 183 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ధోనీని కెరీర్ దూసుకపోయింది. టీమిండియా కెప్టెన్ అయిన తర్వాత, ధోని తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుని లోయర్ ఆర్డర్‌లో ఆడటం ప్రారంభించాడు. ఇక్కడ తుఫాను బ్యాట్స్‌మెన్ ధోని ఫినిషర్‌గా మెరిశాడు. ఈ రోజు అతను గొప్ప ఫినిషర్‌లలో ఒకడిగా పేరుగాంచాడు.

ధోని భారత్ తరపున 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ODIలలో, అతను భారతదేశం తరపున 350 ODIలు ఆడాడు. 50.57 సగటుతో 10773 పరుగులు చేశాడు. వన్డేల్లో ధోనీ 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు సాధించాడు. భారత్ తరపున ధోనీ 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 37.60 సగటుతో 1617 పరుగులు చేశాడు.

ఐపీఎల్ ట్రోఫీతో ధోనీ..

View this post on Instagram

A post shared by M S Dhoni (@mahi7781)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..