ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది.. కన్నీళ్లుపెట్టుకున్న ప్రవీణ్.. సీరియస్ అయిన ఫైమా

బుల్లితెర నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ప్రముఖ బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొంతమంది కమెడియన్స్ గా సినిమాల్లో చేస్తున్నారు. మరికొంతమంది హీరోలుగా మారారు.. వీరితో పాటు వేణు, ధనరాజ్ లాంటి వారు దర్శకులుగా తమ ప్రతిభ చాటుకుంటున్నారు. ఇక జబర్దస్త్ లో చేసిన లేడీ కంటెంట్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఫైమా ఒకరు.

ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది.. కన్నీళ్లుపెట్టుకున్న ప్రవీణ్.. సీరియస్ అయిన ఫైమా
Jabardasth Faima And Pravee
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 07, 2025 | 7:02 PM

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా వారిలో ఫైమా ఒకరు. ఈ చిన్నది తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించింది. తన పంచ్ లతో ఫైమా మంచి క్రేజ్ తెచ్చుకుంది. బుల్లితెరపై బాగా సక్సెస్ అయిన వారిలో ఫైమా కూడా ఒకరు. ఫైమా కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు టీవీషోలతో బిజీ బిజీగా ఉంటోంది ఫైమా. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ గేమ్ షోలో కూడా పాల్గొంది. బిగ్ బాస్ లో తన గేమ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది ఈ భామ. ఇక ఈ చిన్నదాని ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అనే చెప్పాలి.

కాగా ఫైమా తన తోటి కమెడియన్ పటాస్ ప్రవీణ్‌తో ప్రేమలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని నెలల క్రితం తన కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చిందీ లేడీ కమెడియన్. గతంలో ప్రవీణ్ అనే అబ్బాయితో తాను చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫైమా. అయితే ఫైమా పటాస్ షోలో చేసిన ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. జబర్దస్త్ ప్రవీణ్, పటాస్ ఫైమా లవ్ స్టోరీ గతంలో హాట్ టాపిక్ .

ప్రవీణ్, ఫైమా చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆతర్వాత కొన్ని రోజులకు ఫైమా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నట్టు అనౌన్స్ చేసింది. అయితే పటాస్ ప్రవీణ్ తో సన్నిహితంగా ఉండటం, ప్రేమ ఇవన్నీ కేవలం షో కోసమే అని కొందరు అంటున్నారు. కానీ ఇంకొందరు మాత్రం ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారు అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి షో ఓ ప్రమోను విడుదల చేసింది. ఈ వీడియోలో ప్రవీణ్ మాట్లాడుతూ.. తన ప్రేమ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించా..కొన్ని రోజులు బాగానే ఉన్నాం.. కానీ ఆతర్వాత నీకు నాకు సెట్ అవ్వదు.. నీ లైఫ్ నువ్వు చూసుకో.. నా లైఫ్ నేను చూసుకుంటానని.. నన్ను వదిలేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దానికి అక్కడే ఉన్న ఫైమా సీరియస్ అయ్యింది. ” నువ్వేం మాట్లాడుతున్నావ్.. నాకు కనీసం అర్థం అవ్వడం లేదు.నన్ను బ్యాడ్ చేయాలని, నెగిటివ్ చేయాలనే నువ్వు అలా మాట్లాడుతున్నావ్” అంటూ సీరియస్ అయ్యింది. అయితే ప్రవీణ్ చెప్పింది ఫైమా గురించే అని అంటున్నారు నెటిజన్స్. అసలు విషయం ఏంటి అనేది పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .