AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ఫ్యాన్స్‌ ముసుగులో ధోని పరువు తీస్తున్నారు? ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోండి..!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల కంటే.. ధోని బ్యాటింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. అభిమానుల ఒత్తిడి, వయసుతో వచ్చే సమస్యలు ధోనిని ఇబ్బందుల్లో పెడుతున్నాయి. రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతున్నప్పటికీ, ధోని సీఎస్కేకు కీలకమైన ఆటగాడుగా కొనసాగుతున్నాడు. కానీ, ధోనిపై ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్ కు అతని అభిమానులే కారణం.

MS Dhoni: ఫ్యాన్స్‌ ముసుగులో ధోని పరువు తీస్తున్నారు? ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోండి..!
Ms Dhoni
Follow us
SN Pasha

|

Updated on: Apr 06, 2025 | 6:11 PM

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎంత సక్సెస్‌ఫుల్‌ టీమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. మధ్యలో ఓ రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నప్పటికీ.. మిగిలిన 15 సీజన్స్‌లో ఐదు సార్లు సీఎస్‌కేనే ట్రోఫీని గెలుచుకుంది. ఈ లెక్కలు చాలు ఐపీఎల్‌లో ఎల్లో ఆర్మీ డామినేషన్‌ ఏంటో చెప్పడానికి. మరి సీఎస్‌కే ఇంత సక్సెస్‌ అవ్వడానికి కారణం ఎవరు అంటే..? వందలో 90 మంది చెప్పే పేరు.. మహేంద్ర సింగ్‌ ధోని. కానీ, ఇప్పుడు అదే ధోనిని చాలా మంది నిందిస్తున్నారు. బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడని, జట్టుకు భారంగా మారాడని, రిటైర్మెంట్‌ ఇవ్వకుండా ఇంకా టీమ్‌ను పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాడంటూ ధోనిని అనరాని మాటలు అంటున్నారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన చెన్నై.. సీజన్‌ను గ్రాండ్‌గా మొదలుపెట్టినట్లు కనిపించింది. కానీ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ ఓటముల్లో యాజ్‌ ఏ టీమ్‌ సీఎస్‌కే ప్రదర్శన కంటే కూడా.. ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌, ధోని రన్స్‌ గురించే ఎక్కవ చర్చ జరుగుతోంది.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 98 పరుగులు అవసరమైన సమయంలో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు ధోని. కానీ, జట్టు విజయానికి అవసరమైన రిక్వైర్డ్‌ రన్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. ఎస్‌.. ధోని మునుపటిలా ఆడలేకపోతున్నాడు అనేది వాస్తవం. కానీ, ఆ వాస్తవాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడెప్పుడో.. లాంగ్‌ హెయిర్‌తో, యంగ్‌ ఏజ్‌లో హెలికాప్టర్‌ షాట్లతో విరుచుకుపడే ధోనిని.. ఇప్పుడు కూడా చూడాలనుకోవడం ముర్ఖత్వం అవుతుంది. 43 ఏళ్ల వ్యక్తి 18 ఏళ్ల కుర్రాడిలా మారిపోయి బ్యాటింగ్‌ చేయాలనుకోవడం అత్యాశ కూడా కాదు పిచ్చి అవుతుంది. మరి టీమ్‌ విజయానికి కావాల్సిన టైమ్‌.. రిక్వైర్డ్‌ రన్‌రేట్‌కు తగ్గట్లు బ్యాటింగ్‌ చేయలేనప్పడు ఎందుకు ఆడటం రిటైర్మెంట్‌ ఇవ్వొచ్చు కదా? అని అనొచ్చు. ఎస్‌.. ఇది వ్యాలీడ్‌ క్వశ్చన్‌. టీమ్‌ అవసరాలకు తగ్గట్లు ఆడలేని వాళ్లు, వయసు మీదపడిన వాళ్లు రిటైర్మెంట్‌ ఇచ్చేయడమే బెటర్‌.

టీమిండియా విజయంలో ధోని అది ఎప్పుడో చేశాడు. యంగ్‌ టాలెంట్‌ టీమ్‌లోకి వస్తున్న టైమ్‌లో అతను తప్పుకున్నాడు. కానీ, సీఎస్‌కే విషయంలో అలా చేయలేకపోయాడు. అది తప్పే. కానీ, అందుకు కారణాలు కూడా చూడాలి. సీఎస్‌కే అంటే ఒక బ్రాండ్‌లా మారడానికి ఏకైక కారణం ధోని. ధోని అంటే సీఎస్‌కే, సీఎస్‌కే అంటే ధోని. ఇది నా టీమ్‌ అని ధోని ఇప్పటికే ప్రకటించాడు. మరే ఆటగాడు కూడా తన ఫ్రాంచైజ్‌ విషయంలో ఇంత బలంగా చెప్పలేడేమో. కెప్టెన్‌గా సీఎస్‌కేకు ఐదు ట్రోఫీలో అందించాడు. ఆ లెగసీ కొనసాగాలంటే.. ధోని ఉన్నపళంగా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేస్తే సరిపోదు. ధోని అలా వెళ్లిపోతే.. చెన్నై ఓ సాధారణ టీమ్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నా తర్వాత కూడా సీఎస్‌కే స్ట్రాంగ్‌గా ఉండాలంటే టీమ్‌కు ఓ మంచి కెప్టెన్‌ను తయారు చేయాలని ధోని అనుకున్నాడు.. అందుకోసం జడేజాను ట్రై చేశాడు వర్క్‌ అవుట్‌ కాలేదు. రుతురాజ్‌ను నమ్మాడు.. మెల్లమెల్లగా అతన్ని నిలబెతున్నాడు.

ఒక విషయం గమినిస్తే.. టీమిండియా విషయంలోనూ ధోని అదే చేశాడు. విరాట్‌ కోహ్లీ లాంటి ఒక స్ట్రాంగ్‌ ప్లేయర్‌ టీమిండియాను తన తర్వాత సమర్థవంతంగా నడిపించగలడని నమ్మిన తర్వాతనే.. కెప్టెన్సీ అతనికి అప్పగించి, కొన్నేళ్లు అతని కెప్టెన్సీలో ఆడి ఆ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కానీ, కోహ్లీ దొరికినట్లు.. ఇక్కడ సీఎస్‌కే విషయంలో అంత ఈజీగా దొరకడం లేదు. ఈ విషయం పక్కనపెడితే.. ధోని మోకాలి నొప్పితో బాధపడుతూ.. తన శరీరాన్ని హింసపెడుతూ.. అవమానాలు కూడా భరిస్తూ.. ఇంకా ఐపీఎల్‌ ఆడుతున్నాడు అంటే అందుకు కారణం.. ధోని అభిమానులు. ఎస్‌.. ఫ్యాన్స్‌ కోసమే ధోని ఇంకా ఆడుతున్నాడు. అసలు వీళ్లని ధోని ఫ్యాన్స్‌ అనే బదులు ధోని పిచ్చోళ్లు అనాలి. వీళ్లకు ధోని అంటే ఎంతో పిచ్చో అందరికీ తెలిసిందే. తలా ఫర్‌ ఏ రీజన్‌ అంటూ ఊగిపోతుంటారు. నెంబర్‌ సెవెన్‌ కనిస్తే చాలు.. మైమరిచిపోతారు. అంతలా ధోనిని ఆరాధిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు. కానీ, వీరి పిచ్చి ప్రేమే.. ఇప్పుడు ధోని పరువుపోయేలా చేస్తుందని అనడంలో ఎలాంటి తప్పు లేదు.

నిజానికి 2023లో సీఎస్‌కే ట్రోఫీ గెలిచిన తర్వాత ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి, సీఎస్‌కే మెంటర్‌గానో, కోచ్‌గానో కొనసాగి ఉంటే ఎంతో హుందాగా, గౌరవంగా ఉండేది. అబ్బే.. అలా కుదరదుగా.. ధోని ఆడాల్సిందే, బ్యాట్‌ పట్టుకొని క్రీజ్‌లోకి దిగాల్సిందే, వికెట్ల వెనుక నుంచి మ్యాచ్‌ను ములుపు తిప్పాల్సిందే అంటే.. 43 ఏళ్ల వయసులో కూడా ధోనిపై భారం మోపుతున్నారు. సరే ఫ్యాన్స్‌ అంతా కోరుకుంటున్నారని, ఆడుతుంటే.. వయో భారం ధోనిని మునుపటిలా ఆడేందుకు అడ్డుపడుతోంది. ఫ్యాన్స్‌ అంటే అర్థం చేసుకుంటారు.. కానీ, ప్రస్తుతం పిచ్చిగా పేట్రేగి పోతున్న సోషల్‌ మీడియా జమానా ఊరుకుంటుందా.. ధోనిని దారుణంగా ట్రోల్‌ చేస్తోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌.. ఏది ఓపెన్‌ చేసినా.. ధోనిపై సెటైర్లు, అతని బ్యాటింగ్‌పై జోకులు కనిపిస్తున్నాయి.

అయినా.. ఇప్పటి సోషల్‌ మీడియా కుర్రాళ్లకు ధోని అంటే ఏంటో తెలియకపోవచ్చు.. అతను ఆడుతున్న డాట్‌ బాల్స్‌, పవర్‌లెస్‌ షాట్స్‌ మాత్రమే వాళ్లకు ఇప్పుడు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ, ధోని అంటే ఏంటో తెలిసిన వాళ్లుకు ప్రస్తుతం ధోనిపై జరుగుతున్న ట్రోలింగ్‌ చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. ఇంతలా ధోని పరువు పోతుండటానికి కారణం మాత్రం హండ్రెడ్‌ పర్సెంట్‌ అతని అభిమానులే.. ధోని ఆడాల్సిందే అని ఇంతలా బలవంతం చేయకుండా ఉంటే.. ధోని ఎప్పుడో గౌరవంగా ఐపీఎల్‌ నుంచి తప్పుకునేవాడు. ఇప్పటికైనా.. పిచ్చి అభిమానంతో ధోనిని బలవంతం చేయకండి.. మా కోసం ఆడాలని అడగకండి. రిటైర్మెంట్ విషయం ధోనికే వదిలేయండి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..