AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే వార్త..ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై సీఈఓ సంచలన ప్రకటన

ఐపీఎల్ అభిమానులను, ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌ను కొన్ని నెలలుగా వెంటాడుతున్న ప్రశ్న మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ రిటైర్ అవుతారా లేక కొనసాగుతారా? ఈ సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ధోనీ ఫిట్‌నెస్, భవిష్యత్ గురించి అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఐపీఎల్ 2026 సీజన్‌కు కూడా తాను అందుబాటులో ఉంటానని ధోనీ స్వయంగా కన్ఫాం చేశారు.

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే వార్త..ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై సీఈఓ సంచలన ప్రకటన
చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశి విశ్వనాథన్ మహేంద్ర సింగ్ ధోని పదవీ విరమణ చేయడం లేదని, IPL 2026 లో ఆడతాడని ధృవీకరించారు. "ఐపీఎల్ 2026 లో ధోనిని మనం ఖచ్చితంగా చూస్తాం" అని కాశి ఈ విషయాన్ని ధృవీకరించారు.
Rakesh
|

Updated on: Nov 07, 2025 | 6:32 PM

Share

MS Dhoni : ఐపీఎల్ అభిమానులను, ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌ను కొన్ని నెలలుగా వెంటాడుతున్న ప్రశ్న మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ రిటైర్ అవుతారా లేక కొనసాగుతారా? ఈ సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ధోనీ ఫిట్‌నెస్, భవిష్యత్ గురించి అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఐపీఎల్ 2026 సీజన్‌కు కూడా తాను అందుబాటులో ఉంటానని ధోనీ స్వయంగా కన్ఫాం చేశారు. ఈ శుభవార్తను సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఐపీఎల్ మొదటి సీజన్ (2008) నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఆ టీమ్‌కు ఐదు టైటిల్స్ అందించిన ఎంఎస్ ధోనీ, తన భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేశారు. గతంలో తన ఫిట్‌నెస్ ఆధారంగా నవంబర్-డిసెంబర్‌లో నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ధోనీ, ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్‌కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ ప్రకటన ధోనీ ఫిట్‌నెస్‌పై ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కూడా ధోనీ వలే 2008 నుంచి ఫ్రాంచైజీతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన క్రిక్‌బజ్‎తో మాట్లాడుతూ.. “ఎంఎస్ ధోనీ తదుపరి సీజన్‌కు అందుబాటులో ఉంటానని మాకు తెలిపారు” అని అధికారికంగా ప్రకటించారు. దీంతో గతంలో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి ప్రతి ఏటా వచ్చే రిటైర్మెంట్ ఊహాగానాలకు బ్రేక్ పడింది.

ధోనీ అందుబాటులో ఉండటం ఖాయం కావడంతో, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రాబోయే ఐపీఎల్ 2026 కోసం తమ జట్టు కూర్పుపై దృష్టి సారించింది. టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, సీఈఓ, ఇతర అధికారులు నవంబర్ 10, 11 తేదీల్లో ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే వేలానికి ముందు ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలి, ఎవరిని రిలీజ్ చేయాలనే దానిపై చర్చ జరగనుంది. అంతేకాకుండా, సంజు శాంసన్ ట్రేడ్ డీల్‌పై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్ వివరాలు, ఫ్రాంచైజీల డెడ్‌లైన్ షెడ్యూల్:

ఆక్షన్ తేదీ: ఐపీఎల్ 2026 కోసం వేలం డిసెంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. వేలం జరిగే వేదికపై ఇంకా చర్చ జరుగుతోంది. అయితే ఇది భారతదేశం వెలుపల యూఏఈలో జరిగే అవకాశం ఉందని సమాచారం.

రిటెన్షన్ డెడ్‌లైన్: అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి నవంబర్ 15 వరకు డెడ్‌లైన్ ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. పర్యాటకులకు నో ఎంట్రీ..!
పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. పర్యాటకులకు నో ఎంట్రీ..!
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..