AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురి పై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఆస్తిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ వేధిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను చెట్టుకు కట్టేసి కొట్టి చంపింది.

Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
Wife Kills Husband Over Daughters Harassment (1)
P Shivteja
| Edited By: |

Updated on: Oct 13, 2026 | 4:07 PM

Share

కూతురిని లైంగికంటే వేదిస్తున్నాడనే కారణంతో ఓ మహిళ భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేట తండాకు చెందిన బానోతు భగవాన్ (43)కు, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండాకు చెందిన మాలోతు రాజేశ్వరితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. రాజేశ్వరికి అంతకుముందే వివాహం కాగా, మొదటి భర్త డెంగీతో మృతిచెందాడు. మొదటి భర్తకు ఒక కుమార్తె ఉండగా, భగవాన్‌తో రెండో వివాహం తర్వాత మరో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించారు

రాజేశ్వరి మొదటి భర్తకు జన్మించిన కుమార్తె హుస్నాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. దీనితో భగవాన్ ఆ యువతి పై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఆమె పేరిట ఉన్న ఆస్తిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని భార్యను, కుమార్తెను వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక రాజేశ్వరి తన పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ సమస్యను బంధువుల సమక్షంలో పరిష్కరించు కుందామనే ఉద్దేశంతో ఆదివారం భగవాన్ సేవాలాల్ మహారాజ్ తండాకు వచ్చాడు.

అయితే, మద్యం సేవించి వచ్చిన అతడు భార్యతో పాటు ఆమె మొదటి భర్త కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తూ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన రాజేశ్వరి భర్తను చెట్టుకు కట్టేసి, కారం చల్లి ఇనుపరాడ్డుతో దాడి చేసింది. ఈ దాడిలో తీవ్ర గాయాలైన భగవాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్వరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us