AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియాలోకి దూసుకొస్తోన్న తుఫాన్.. అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం..!

Anvay Dravid: టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడుతూ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. తండ్రికి భిన్నంగా దూకుడైన బ్యాటింగ్‌తో పరుగులు చేస్తున్న అన్వయ్, భారత అండర్ 19 జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. టీమిండియాలోకి త్వరలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

టీమిండియాలోకి దూసుకొస్తోన్న తుఫాన్.. అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం..!
Anvay Dravid
Venkata Chari
|

Updated on: Oct 13, 2026 | 2:09 PM

Share

Anvay Dravid: టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, “ది వాల్” గా పేరుగాంచిన రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. యువ క్రికెటర్లందరి దృష్టిని ఆకర్షిస్తూ, తనదైన దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇటీవల వినూ మన్కడ్ ట్రోఫీ అండర్ 19 వన్డే టోర్నమెంట్ లో కర్ణాటక తరపున ఆడుతున్న 17 ఏళ్ల అన్వయ్, తన అద్భుతమైన ప్రదర్శనలతో క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో అన్వయ్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ యువ సంచలనం కేవలం 41 బంతుల్లోనే 85 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 7 భారీ సిక్సర్లు, 5 బౌండరీలు ఉన్నాయి. అతని దాటికి కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఢిల్లీని 220 పరుగులకే కట్టడి చేసి 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ ఉంది. భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 35 బంతుల్లో 32 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకప్పుడు భారత క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన ఇద్దరు దిగ్గజాల కుమారులు ఒకే మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా తలపడటం క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: 6,W,6,W,6,W,6,W,6,W.. సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!

అన్వయ్ ప్రదర్శన ఢిల్లీ మ్యాచ్‌కే పరిమితం కాదు. అతను వినూ మన్కడ్ ట్రోఫీలో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అంతకుముందు చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 62 బంతుల్లోనే 104 పరుగులు సాధించి శతకం బాదాడు. అలాగే, భారత అండర్ 19 జట్టు తరపున శ్రీలంక యువజట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ 67 బంతుల్లో 87 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు.

రాహుల్ ద్రావిడ్ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన డిఫెన్స్‌తో “ది వాల్” గా పేరు తెచ్చుకున్నారు. 23 వేలకు పైగా పరుగులు సాధించిన ద్రావిడ్, సంప్రదాయ క్రికెట్‌కు ప్రతీకగా నిలిచారు. అయితే, తండ్రికి భిన్నంగా అన్వయ్ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తండ్రి డిఫెన్స్ మోడ్‌లో బ్యాటింగ్ చేస్తే, కొడుకు మాత్రం దూకుడుగా పరుగులు సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకుంటున్నాడు.

ఎక్కువమంది చదివినది: బ్రేకప్‌కు బ్రేక్.. మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్.. అసలు ఏం జరిగిందంటే?

అన్వయ్, ఆర్యవీర్ ఇద్దరూ ఇటీవల భారత అండర్ 19 జట్టులో చోటు దక్కించుకున్నారు. నవంబర్ లో జరగనున్న అండర్ 19 ఆసియా కప్పులోను వీరిద్దరు ఆడే అవకాశం ఉంది. వరుసగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రతిభ చాటుతున్న అన్వయ్, ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలో టీమిండియా తలుపులు తట్టడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని భవిష్యత్తు క్రికెట్ ప్రస్థానంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
వాట్సప్‌లో "నో" అనే మెస్సేజ్ వస్తే అలర్ట్.. క్లిక్ చేస్తే అంతే..
వాట్సప్‌లో
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్
మెట్ల కింద టాయిలెట్ నిర్మిస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ విషయాలు..
మెట్ల కింద టాయిలెట్ నిర్మిస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ విషయాలు..