AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ఏంటి.. ఇతని సక్సెస్‌ వెనుక కూడా ధోనినే ఉన్నాడా? తలా ఫర్‌ ఏ రీజన్‌ గురు..

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన యువ బ్యాట్స్‌మన్ అశుతోష్ శర్మ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 66 పరుగులు చేసి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ధోని, శిఖర్ ధావన్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజాల మార్గదర్శకత్వం అతని విజయంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిపాడు.

MS Dhoni: ఏంటి.. ఇతని సక్సెస్‌ వెనుక కూడా ధోనినే ఉన్నాడా? తలా ఫర్‌ ఏ రీజన్‌ గురు..
Ms Dhoni Ashuthosh Sharma
SN Pasha
|

Updated on: Mar 28, 2025 | 3:58 PM

Share

ఐపీఎల్‌ 2025లో ఓ కొత్త కుర్రాడి పేరు బాగా వినిపిస్తోంది. తక్కువ ధరకు ఢిల్లీకి దొరికి, తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయాన్ని అందించాడు. అతను మరెవరో కాదు అశుతోష్‌ శర్మ. ఈ నెల 24న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశుతోష్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆల్‌మోస్ట్‌ ఓడిపోతున్న మ్యాచ్‌లో ఢిల్లీకి విజయం అందించాడు. చివర్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌కు సూపర్‌ ఫినిష్‌ అందించాడు. కేవలం 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 66 పరుగులు సాధించాడు. అందులోనూ చివరి 11 బంతుల్లోనే 44 పరుగులు చేయడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత క్రికెట్‌ వర్గాల్లో అశుతోష్‌ పేరు బాగా వినిపించింది.

ఢిల్లీకి అదిరిపోయే ఫినిషర్‌ దొరికాడని, త్వరలోనే టీమిండియా కూడా ఆడతాడంటూ క్రికెట్‌ అభిమానులు సైతం అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే విన్నింగ్‌ షాట్‌ ఆడిన తర్వాత.. అశుతోష్‌ స్విచ్‌ హిట్‌ ఆడుతున్నట్లు సెలబ్రేట్‌ చేసి.. ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటర్‌ కెవిన్‌ పీటర్సన్‌కు ఆ సెలబ్రేషన్స్‌ డెడికేట్‌ చేశాడు. అలాగే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్న తర్వాత.. తన మెంటర్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌కు తన అవార్డును అంకితం ఇచ్చాడు. తన కెరీర్‌లో శిఖర్‌ పాజీ ఎంతో కీలక పాత్ర పోషించారని, ఆయనే తన గురువంటూ అశుతోష్‌ పేర్కొన్నాడు. అలాగే మ్యాచ్‌ తర్వాత శిఖర్‌ ధావన్‌తో వీడియో కాల్‌ కూడా మాట్లాడాడు.

తన సక్సెస్‌లో ధావన్‌, పీటర్సన్‌తో పాటు తాజాగా ధోనికి కూడా భాగం ఉందని అంటున్నాడు అశుతోష్‌ శర్మ. లాస్ట్‌ సీజన్‌లో అశుతోష్‌ పంజాబ్‌కు ఆడిన విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌ తర్వాత తాను ధోనితో మాట్లాడానని, మ్యాచ్‌ ఫినిష్‌ చేసే సమయంలో మీ మైండ్‌లో ఏం రన్‌ అవుతుందని ధోనిని అడినట్లు వెల్లడించాడు. ధోని చెప్పిన విషయాలు తనకు ఎంతో హెల్ప్‌ చేశాయని కూడా అశుతోష్‌ అన్నాడు. అయితే.. ధోని చెప్పిన విషయం ఏంటో మాత్రం అశుతోష్ బయటపెట్టలేదు, దాన్ని సీక్రెట్‌ అంటూ పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..