Ind Vs Aus: టీమిండియాపై ఈ 5గురు అమేజింగ్ బ్యాట్స్‌మెన్లు.. బౌలర్లకు ఓ పీడకల.. ప్రస్తుతం ఆ ఇద్దరే డేంజర్!

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పాల్గొంటుంది.

Ind Vs Aus: టీమిండియాపై ఈ 5గురు అమేజింగ్ బ్యాట్స్‌మెన్లు.. బౌలర్లకు ఓ పీడకల.. ప్రస్తుతం ఆ ఇద్దరే డేంజర్!
Ind Vs Aus
Follow us

|

Updated on: Feb 06, 2023 | 12:23 PM

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పాల్గొంటుంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలనే లక్ష్యంతో టీమిండియా సన్నద్ధం అవుతుండగా.. భారత్‌పై రివెంజ్ కోసం ఆస్ట్రేలియా అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తోంది. మరి ఈ సిరీస్ కంటే ముందు భారత్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎవరో ఇప్పుడు చూద్దామా.?

మాథ్యూ హేడెన్:

ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత గడ్డపై 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన హేడెన్, 22 ఇన్నింగ్స్‌లలో 51.35 సగటుతో 1027 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

మైకేల్ క్లార్క్:

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ రెండో స్థానంలో ఉన్నాడు. క్లార్క్ భారత్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 972 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి సగటు 40.50 కాగా, ఇందులో 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. క్లార్క్ భారత్‌లో అరంగేట్రం చేయడమే కాదు.. తొలి టెస్టులోనే సెంచరీ బాదాడు.

అలెన్ బోర్డర్:

మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మరో దిగ్గజ బ్యాట్స్‌మెన్ అలెన్ బోర్డర్ ఉన్నాడు. ఈ మాజీ కెప్టెన్ భారత్‌లో తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడి 51.06 సగటుతో 766 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సైమన్ కటిచ్:

ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన కటిచ్ భారత గడ్డపై 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 40.83 సగటుతో 735 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రికీ పాంటింగ్:

ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్ భారత్‌లో 14 టెస్టు మ్యాచ్‌లు ఆడి 662 పరుగులు చేశాడు. అతడి సగటు 26.48 కాగా.. ఆ సమయంలో పాంటింగ్ బ్యాట్‌ నుంచి ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు వచ్చాయి.

స్టీవ్ స్మిత్:

ప్రస్తుత జట్టు సభ్యుడైన స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. స్మిత్ ఇప్పటివరకు భారత్‌లో ఆరు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, ఇందులో అతడి సగటు 60 కాగా.. చేసింది 660 పరుగులు. ఈ సమయంలో స్మిత్ 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ చేశాడు.

కాగా, వీరిలో ఒక స్టీవ్ స్మిత్ ఒక్కడే ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్ట్ సభ్యుడు. ఇతడితో పాటు మరో బ్యాటర్ మర్నాస్ లబూషన్, ఉస్మాన్ ఖవాజా స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఘటికులు. వీరితో టీమిండియాకు కచ్చితంగా ప్రమాదమే అని చెప్పొచ్చు.