IND Vs AUS: ఇదేంటబ్బా! భయపడుతోన్న టీమిండియా.. పక్కాగా స్కెచ్ వేస్తోన్న ఆస్ట్రేలియా.. సీన్ కట్ చేస్తే!

భారత్-ఆస్ట్రేలియా మధ్య 4 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఇది భారత్‌లో..

IND Vs AUS: ఇదేంటబ్బా! భయపడుతోన్న టీమిండియా.. పక్కాగా స్కెచ్ వేస్తోన్న ఆస్ట్రేలియా.. సీన్ కట్ చేస్తే!
Ind Vs Aus Border Gavaskar
Follow us

|

Updated on: Feb 06, 2023 | 12:46 PM

భారత్-ఆస్ట్రేలియా మధ్య 4 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఇది భారత్‌లో జరుగుతుండగా.. టీమిండియా బలమైన పోటీనిచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితేనేం భారత ప్లేయర్స్ మాత్రం నెట్స్‌లో కఠోరంగా ప్రాక్టిస్ చేస్తున్నారు. అలాగే బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతో 6 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ స్పిన్నర్‌ని నెట్‌ బౌలర్‌గా జట్టులోకి తీసుకుంది టీమ్‌ మేనేజ్‌మెంట్‌.

రెండు జట్ల మధ్య జరిగిన చివరి మూడు టెస్ట్ సిరీస్‌లు టీమిండియా అద్భుత విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భారత్ తన సొంతగడ్డపై ఆస్ట్రేలియాను రెండుసార్లు ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది. ముఖ్యంగా స్వదేశంలో గత పదేళ్లలో ఏ టెస్టు సిరీస్‌ను కోల్పోని రికార్డును నిలబెట్టుకోవాలనే లక్ష్యం అడుగులు వేస్తోంది.

మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని మొదటి టెస్ట్ నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9న ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టులో ఇప్పటికే ఎంపిక చేసిన నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ టీమ్ మేనేజ్‌మెంట్ మరో 6 మంది స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా తీసుకుంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం , హర్యానా స్పిన్ ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్, ఢిల్లీ స్పిన్నర్ పుల్కిత్ నారంగ్ కూడా నెట్ బౌలర్‌లుగా జట్టులో చేరారు. ఇందులో విశేషమేంటంటే.. 11 నెలల క్రితం భారత జట్టు తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన జయంత్ యాదవ్ భారత్ తరఫున 6 టెస్టులు మాత్రమే ఆడాడు. ఒక సెంచరీతో పాటు 16 వికెట్లు పడగొట్టాడు.

సుందర్ సహా నలుగురు స్పిన్నర్లు..

ఈ సిరీస్‌కు నెట్ బౌలర్‌గా జయంత్ యాదవ్ ఎంపిక కాగా, అతడితో పాటు పుల్కిత్, మరో 4 మంది స్పిన్నర్లను కూడా ప్రాక్టిస్ క్యాంపుకు పిలిచింది టీమిండియా మేనేజ్‌మెంట్. అందులో మరో ముఖ్యమైన బౌలర్ వాషింగ్టన్ సుందర్. రెండేళ్ల క్రితం ఇంగ్లాండ్‌తో భారత్‌ తరఫున సుందర్ చివరి టెస్టు ఆడాడు. సుందర్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్ కుమార్, తమిళనాడుకు చెందిన ఆర్ సాయి కిషోర్, రాజస్థాన్‌కు చెందిన రాహుల్ చాహర్ కూడా నాగ్‌పూర్‌లో జట్టుతో ఉన్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?