World Cup 2023: ప్రపంచ కప్ 2023లో డేంజరస్ బౌలర్లు వీరే.. టాప్ 5లో భారత్ నుంచి ఒక్కరే..

Dale Steyn: ప్రపంచ కప్ 2023 గురించి మాట్లాడితే, అక్టోబర్ 5 నుంచి ఈ మహా సంగ్రామం జరగనుంది. ప్రస్తుతం వార్మప్ మ్యాచ్‌లతో అన్ని జట్లు బిజీగా ఉన్నాయి. అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉన్న చాలా జట్లు ప్రపంచ కప్ బరిలో నిలిచాయి. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. డేల్ స్టెయిన్ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, భారతదేశం నుంచి ఒక్కొక్క ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేశాడు. డేల్ స్టెయిన్ భారత జట్టు నుంచి హైదరాబాదీని ఎంపిక చేశాడు.

World Cup 2023: ప్రపంచ కప్ 2023లో డేంజరస్ బౌలర్లు వీరే.. టాప్ 5లో భారత్ నుంచి ఒక్కరే..
World Cup 2023
Follow us
Venkata Chari

|

Updated on: Oct 01, 2023 | 6:40 AM

ICC World Cup 2023: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ వెటరన్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రపంచ కప్ 2023లో అద్భుతంగా రాణించగల ఐదుగురు బౌలర్లను పేర్కొన్నాడు. అందరి దృష్టి వారిపైనే ఉంటుందని తెలిపాడు. ఐదుగురు బౌలర్ల జాబితాలో డేల్ స్టెయిన్ ఒకే ఒక్క భారత బౌలర్‌ను మాత్రమే ఎంచుకున్నాడు. ప్రపంచ కప్ 2023 గురించి మాట్లాడితే, అక్టోబర్ 5 నుంచి ఈ మహా సంగ్రామం జరగనుంది. ప్రస్తుతం వార్మప్ మ్యాచ్‌లతో అన్ని జట్లు బిజీగా ఉన్నాయి. అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉన్న చాలా జట్లు ప్రపంచ కప్ బరిలో నిలిచాయి. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. డేల్ స్టెయిన్ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, భారతదేశం నుంచి ఒక్కొక్క ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేశాడు.

డేల్ స్టెయిన్ భారత జట్టు నుంచి మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశాడు. అతను పాకిస్థాన్ జట్టు నుంచి షాహీన్ షా ఆఫ్రిదిని ఎంపిక చేశాడు. అలాగే న్యూజిలాండ్ జట్టు నుంచి ట్రెంట్ బౌల్ట్, దక్షిణాఫ్రికా నుంచి కగిసో రబాడ, ఇంగ్లాండ్ నుంచి మార్క్ వుడ్‌లను ఎంపిక చేశాడు.

ఇవి కూడా చదవండి

స్వింగ్‌తో సిరాజ్ చాలా డేంజర్ – డేల్ స్టెయిన్

ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో, డేల్ స్టెయిన్ మహ్మద్ సిరాజ్, ఇతర బౌలర్లందరి గురించి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

‘మహ్మద్ సిరాజ్ బంతిని బాగా స్వింగ్ చేసి పెద్ద బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయగలడు. అతను భారతదేశానికి ముఖ్యమైన ఆటగాడు. ఇది కాకుండా, కగిసో రబాడకు చాలా పేస్ ఉంది. అతనికి భారత పరిస్థితులు బాగా తెలుసు. న్యూజిలాండ్‌ తరపున ట్రెంట్ బౌల్ట్ బంతిని స్వింగ్ చేశాడు. వికెట్లు తీయడంలో పేరు తెచ్చుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌గా అతడు నిలుస్తాడని భావిస్తున్నాను. మార్క్ వుడ్ అద్భుతమైన పేస్ కలిగి ఉన్నాడు. ఇంగ్లండ్‌ తరపున అతను చాలా వికెట్లు తీయబోతున్నాడని నేను భావిస్తున్నాను’ అంటూ తెలిపాడు.

పేస్‌తో భయపెట్టే షాహీన్ షా అఫ్రిది: డేల్ స్టెయిన్..

View this post on Instagram

A post shared by ICC (@icc)

సాకిస్తాన్ స్టార్ ప్లేయర్ షాహీన్ షా ఆఫ్రిది కొత్త బంతితో వికెట్లు తీయడంలో పేరుగాంచిన బౌలర్. ఇప్పటికే ఇది రుజువైంది. ఈ ప్రపంచకప్‌లోనూ తను సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడంటూ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..