సిరాజ్ కంటే ముందు డీఎస్‌పీ పదవి చేపట్టిన నలుగురు క్రికెటర్లు.. ఫేక్ డిగ్రీతో అడ్డంగా బుక్కైన ఓ ప్లేయర్
Indian Cricketers in Police Force: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం పెద్ద బాధ్యతను అప్పగించింది. అతను పోలీసు శాఖలో డీఎస్పీ అయ్యాడు. 2024 T20 ప్రపంచ కప్‌లో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనకుగానూ తెలంగాణ ప్రభుత్వం అతనికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు భూమిని ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Indian Cricketers in Police Force: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం పెద్ద బాధ్యతను అప్పగించింది. అతను పోలీసు శాఖలో డీఎస్పీ అయ్యాడు. 2024 T20 ప్రపంచ కప్‌లో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనకుగానూ తెలంగాణ ప్రభుత్వం అతనికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు భూమిని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా సిరాజ్ ఇప్పుడు DSPగా ఉద్యోగం దక్కించుకున్నాడు.
మహ్మద్ సిరాజ్ పోలీసు ఉద్యోగం పొందిన మొదటి క్రికెటర్ కాదు. సిరాజ్ కంటే ముందే చాలా మంది క్రికెటర్లు తమ అద్భుతమైన ఆటతీరుతో పోలీస్ ఉద్యోగాలు పొందారు. మహ్మద్ సిరాజ్ కాకుండా పోలీస్ అడ్మినిస్ట్రేషన్‌లో పెద్ద పదవులు పొందిన క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జోగిందర్ శర్మ..
2007 టీ2 వరల్డ్‌కప్‌లో భారత్‌కు కీలక పాత్ర పోషించిన జోగిందర్ శర్మ కూడా పోలీసు శాఖలో ఉన్నాడు. హర్యానా ప్రభుత్వం అతనిని DSPగా నియమించింది. అతను ఇప్పటికీ పోలీస్ శాఖలో పని చేస్తున్నాడు.
హర్భజన్ సింగ్..
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా పోలీసు శాఖలో పనిచేశాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా, పంజాబ్ ప్రభుత్వం హర్భజన్ సింగ్‌కు DSP పదవిని ఇచ్చింది. అయితే, అతను ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. తన పోలీసు ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.
బల్వీందర్ సంధు..
1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు బల్వీందర్ సింగ్ సంధును మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీస్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP)గా నియమించింది. అయితే బల్విందూర్ సంధు క్రికెట్ కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు.
హర్మన్‌ప్రీత్ కౌర్..
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పంజాబ్ పోలీస్‌లో డీఎస్పీగా కూడా నియమితులయ్యారు. మహిళల ప్రపంచ కప్ 2017లో హర్మన్‌ప్రీత్ అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత, పంజాబ్ ప్రభుత్వం ఆమెను డిఎస్‌పిగా చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ తర్వాత, హర్మన్‌ప్రీత్ నకిలీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ బయటపడడంతో.. పంజాబ్ ప్రభుత్వం ఆమెను DSP పదవి నుంచి తొలగించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..