ఈ ఆరుగురు డౌంజరస్ భయ్యో.. బాల్ వేస్తే వికెట్ పడాల్సిందే.. బ్యాటర్ల పాలిట విలన్లు..

Unique Cricket Records​: క్రికెట్ ఆటలో అసాధ్యమైనది ఏదీ లేదు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన రికార్డులు కనిపించాయి. క్రికెట్ చరిత్రలో ప్రత్యేక చరిత్ర సృష్టించిన ఆరుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వీరు బౌలింగ్ ద్వారా అత్యధిక వికెట్లు పడగొట్టారు.

ఈ ఆరుగురు డౌంజరస్ భయ్యో.. బాల్ వేస్తే వికెట్ పడాల్సిందే.. బ్యాటర్ల పాలిట విలన్లు..
Bowld In Cricket
Follow us

|

Updated on: Oct 14, 2024 | 9:46 AM

Unique Cricket Records​: క్రికెట్ ఆటలో అసాధ్యమైనది ఏదీ లేదు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన రికార్డులు కనిపించాయి. క్రికెట్ చరిత్రలో ప్రత్యేక చరిత్ర సృష్టించిన ఆరుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వీరు బౌలింగ్ ద్వారా అత్యధిక వికెట్లు పడగొట్టారు. కేవలం బోల్డ్ చేసి అత్యధిక సంఖ్యలో బ్యాట్స్‌మెన్‌లను బాధితులుగా మార్చుకున్న క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. వసీం అక్రమ్..

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లిస్టులో పాక్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అగ్రస్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో క్లీన్ బౌల్డ్ చేసి 278 వికెట్లు పడగొట్టాడు.

2. వకార్ యూనిస్..

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లలో పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వకార్ యూనిస్ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ అంతర్జాతీయ క్రికెట్‌లో క్లీన్ బౌల్డ్ చేసి 253 వికెట్లు పడగొట్టాడు.

3. మిచెల్ స్టార్క్..

అంతర్జాతీయ క్రికెట్‌లో బంతుల ద్వారా అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లలో ఆస్ట్రేలియా డేంజరస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లో క్లీన్ బౌల్డ్ చేస్తూ 206 వికెట్లు పడగొట్టాడు.

4. జేమ్స్ ఆండర్సన్..

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లలో ఇంగ్లండ్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో క్లీన్ బౌల్డ్ చేస్తూ 201 వికెట్లు పడగొట్టాడు.

5. లసిత్ మలింగ..

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలంక యార్కర్ కింగ్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌లో క్లీన్ బౌల్డ్ చేస్తూ 171 వికెట్లు పడగొట్టాడు.

6. కపిల్ దేవ్..

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆరో స్థానంలో నిలిచాడు. కపిల్ దేవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో క్లీన్ బౌల్డ్ చేస్తూ 167 వికెట్లు పడగొట్టాడు.